మహిళలు ఆరోగ్యంగా ఉండాలంటే..
Images source: google
ఈరోజుల్లో ఎక్కువ మంది మహిళలు గుండె జబ్బులు, థైరాయిడ్ వంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వీటితో పాటు రొమ్ము క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వంటివి కూడా మహిళలను వేధిస్తున్నాయి.
Images source: google
మహిళలు రోజూ వాళ్ల డైట్ లో చేర్చుకోవాల్సిన ఆహార పదార్థాలు ఏంటో మరి చూద్దాం.
Images source: google
వేర్లు ఉండే కూరగాయలు : దుంప జాతి అయిన బీట్ రూట్, క్యారట్, ముల్లంగి, చిలగడ దుంప వంటివి మహిళలు రోజువారీ డైట్ లో చేర్చుకోవాలి. ఇందులోని పొటాషియం, ఫొలేట్, విటమిన్ బి, విటమిన్ సి, ఫైబర్ చర్మం, కంటి ఆరోగ్యాన్ని కాపాడతాయి.
Images source: google
పసుపు : యాంటీ ఇన్ ఫ్లమేటరీగా పని చేసే పసుపును మహిళలు తప్పకుండా డైట్ లో చేర్చుకోవాలి. ఇందులో ఉండే కర్కుమిన్ ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ముఖ్యంగా గుండె జబ్బులు, అల్జీమర్స్, క్యాన్సర్ వంటివి రాకుండా కాపాడుతుంది.
Images source: google
సొయాబీన్స్ : ప్రోటీన్స్ తో మహిళల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. ఎలాంటి గుండె జబ్బులు, స్ట్రోక్, క్యాన్సర్, కరోనరీ హార్ట్ డిసీజ్, వంటివి రాకుండా కాపాడుతుంది. అలాగే ఎముకలు ఆరోగ్యంగా ఉండేలా చేయడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది.
Images source: google
పండ్లను చేర్చుకోవాలి : మహిళలు రోజువారీ డైట్ లో తప్పకుండా మఖానా, అత్తి పండ్లు, ఖర్జూరం, బాదం, పిస్తా వంటివి తప్పకుండా చేర్చుకోవాలి. అలాగే గుమ్మడి, పొద్దు తిరుగుడు గింజలు కూడా చేర్చుకోవాలి. చర్మం, జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటాయి.
Images source: google
పెరుగు తినడం : రోజుకి ఒకసారి అయిన పెరుగు తినడం వల్ల మహిళల్లో ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు. పాలు, పెరుగు తీసుకోవడం వల్ల ఎముకలు, పేగుల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. జీర్ణ క్రియ కూడా సరిగ్గా పనిచేస్తుంది.
Images source: google