https://oktelugu.com/

కిడ్నీ క్యాన్సర్ ఎలా వస్తుందో తెలుసా

Images source: google

కిడ్నీ సమస్యలు:  జీవనశైలి, అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్ల వల్ల ప్రస్తుతం చాలా మంది కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నారు.

Images source: google

కిడ్నీ క్యాన్సర్‌:  కిడ్నీలో రాళ్లు, కిడ్నీ క్యాన్సర్‌ లు ఎక్కువ వస్తున్నాయి. ఈ కిడ్నీ క్యాన్సర్‌ రావడానికి గల కారణాలను ఇప్పుడు తెలుసుకుందాం.

Images source: google

ధూమపానం: ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని చెప్పినా వినరు. ఎక్కువ సిగరెట్లు తాగితే క్యాన్సర్‌ రిస్క్‌ ఎక్కువ అవుతుంది. పొగాకులోని రసాయనాలు కిడ్నీ ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

Images source: google

ఊబకాయం: ఊబకాయం ఎన్నో సమస్యలకు కారణం. దీని వల్ల కణితులు పెరగడానికి కారణమయ్యే హార్మోన్లు ఎక్కువగా రిలీజై కిడ్నీ క్యాన్సర్‌ రిస్క్‌ను పెంచుతాయి.

Images source: google

అధిక రక్తపోటు: హైబీపీ కూడా కిడ్నీ క్యాన్సర్‌కు కారణం. అధిక రక్తపోటు వల్ల మూత్రపిండాల కణజాలం దెబ్బతింటుంది. తద్వారా కిడ్నీ క్యాన్సర్‌ వచ్చే అవకాశం ఉంది.

Images source: google

వయస్సు: కిడ్నీ క్యాన్సర్‌ రావడానికి వయస్సు కూడా కారణమే అంటున్నారు నిపుణులు. 60 సంవత్సరాలు దాటిన వారిలో కిడ్నీ క్యాన్సర్‌ వస్తుంది.

Images source: google

దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులు: దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధులతో బాధ పడితే కిడ్నీ క్యాన్సర్‌ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువ రోజుల నుంచి డయాలసిస్‌ చేయించుకునేవారిలో కిడ్నీ క్యాన్సర్‌ సమస్య వస్తుందట.

Images source: google