భర్తకు దూరంగా ఎక్కువ రోజులు ఉండకూడదు. దీని వల్ల కొన్ని సార్లు భర్తకు చెడు అలవాట్లు కూడా అవుతాయి.

మగవారితో స్నేహం పూర్తిగా మానేయాలి. ఇది మీ భర్త మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. అనుమానించే భర్త అయితే మగవారితో స్నేహం చాలా ప్రమాదమే.

చుట్టాలు, స్నేహితులను ఇంట్లో ఉంచుకోకూడదు. దీని వల్ల మీ భర్తకు కోపం కూడా రావచ్చు. ఏదో ఒక సమయంలో గొడవ కూడా జరగవచ్చు.

భర్తను ఇతరుల దగ్గర తక్కువ చేసి ఎప్పుడు కూడా మాట్లాడకండి. దీని వల్ల మీ మీద కోపం పెరిగిపోతుంది.

భర్తను గౌరవించాలి. తన కష్టానికి విలువ ఇవ్వండి. కుటుంబం కోసం పని చేస్తున్నప్పుడు ఏ పని అయినా సరే ఆయనకు గౌరవం దక్కాలి. లేదంటే బాధ పడతారు.

ఇతరుల కాపురం గురించి ఎప్పుడు కూడా ఇంట్లో మాట్లాడకండి. వారు అలా ఉన్నారు. ఇలా ఉన్నారు అంటూ పోల్చుకోకండి.

భర్తను అభిమానిస్తూ ప్రేమిస్తూ ఉండాలి. దీని వల్ల ఆయన సంతోషంగా ఉంటూ మీతోనే ఉండాలి అనే భావన ఎక్కువ అవుతుంది.

భర్త ఇంటికి రాగానే కోపంగా కాకుండా, ప్రేమగా పలకరించండి. వీలైనంత వరకు నవ్వుతూ నవ్విస్తూ ఉండటానికి ప్రయత్నించండి.

Off-white Banner

Thanks For Reading...