నకిలీ పాలను గుర్తించడం ఎలా?

Images source: google

రోజూ పాలు తాగడం వల్ల ఎముకలు బలంగా తయారవుతాయి. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. అయితే ఈరోజుల్లో అన్ని కల్తీ అయిపోతున్నాయి.

Images source: google

మనం తినే ఫుడ్ నుంచి వాడే వస్తువుల వరకు అన్ని ఇలాంటి కల్తీ పదార్థాలను తినడం వల్ల చాలామంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా చిన్నతనంలోనే పిల్లలు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు.

Images source: google

 పాలను తప్పకుండా చిన్నపిల్లలు రోజూ తాగుతారు. దీనివల్ల వారికి బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కానీ వీటినే కల్తీ చేస్తే ఇంకా ఆరోగ్యం దెబ్బతింటుంది. మరి నకిలీ పాలను గుర్తించడం ఎలా? ఎలాంటి చిట్కాలు పాటించాలో చూద్దాం.

Images source: google

అయోడిన్ రియాజెంట్ : కల్తీ పాలను గుర్తించాలంటే ఒక టెస్ట్ ట్యూబ్‌‌లో పాలు తీసుకోవాలి. దీనికి సగం అయోడిన్ రియాజెంట్ కలిపి బాగా మిక్స్ చేయాలి. పాలు లేత గోధుమ రంగులోకి మారితే అవి స్వచ్ఛమైన పాలు అని అర్థం చేసుకోవాలి. అదే చాక్లెట్ రంగులోకి మారితే పాలు కల్తీ అయినట్లే.

Images source: google

డిటర్జెంట్ పౌడర్ : కొంచెం పాలు తీసుకుని అందులో డిటర్జెంట్ పౌడర్ కలపాలి. ఇందులో కొంచెం నీరు వేసి బాగా తిప్పాలి. అలా తిప్పినప్పుడు డిటర్జెంట్ బాగా నురగ వస్తే పాలు కల్తీ అయినట్లే.

Images source: google

అదే తక్కువగా నురగ వస్తే అవి స్వచ్ఛమైన పాలు అని అర్థం చేసుకోవాలి. పాలు చిక్కగా ఉండాలని కొందరు డిటర్జెంట్ పౌడర్ కలుపుతుంటారు. కాబట్టి డిటర్జెంట్‌తో పౌడర్‌తో కల్తీ పాలను గుర్తించండి.

Images source: google

 కాబట్టి ఇలా బయట పాలను కొనే బదులు ఆవు పాలు వంటివి పిల్లలకు పెట్టడం మంచిది. వీటిలో కూడా కొందరు కల్తీ చేస్తారు.

Images source: google