ఐపీఎల్ 17వ సీజన్ ఉత్కంఠ గా సాగుతోంది..   లీగ్ మ్యాచ్  దశలోనే సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది.

బుధవారం హైదరాబాద్ లో జరిగిన లీగ్ మ్యాచ్లో సన్ రైజర్స్ ముంబై ఇండియన్స్ జట్టుపై 277 పరుగులు చేసింది.

ఐపీఎల్ చరిత్రలో ఇదే అత్యుత్తమ స్కోరు.  హైదరాబాద్ తర్వాత ఐపీఎల్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన జట్ల వివరాలు చూస్తే..

2013 ఐపిఎల్ సీజన్లో బెంగళూరు జట్టు పూణే వారియర్స్ పై ఐదు వికెట్ల నష్టానికి 263 పరుగులు చేసింది. నిన్నటి వరకు ఇది హైయెస్ట్ రికార్డ్ గా ఉండేది.

2023లో లక్నో జట్టు మొహాలీ వేదికగా పంజాబ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్లు కోల్పోయి 257 పరుగులు చేసింది.

2016లో గుజరాత్ లయన్స్ జట్టుపై బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది.

2010 ఐపీఎల్ సీజన్లో చెన్నై జట్టు రాజస్థాన్ రాయల్స్ పై ఐదు వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.

ఇక నిన్న ఛేదనలో సన్ రైజర్స్ పై ముంబై ఇండియన్స్ 246/5  పరుగులు చేసి అత్యధిక పరుగుల జాబితాలో 5వ స్థానంలో నిలిచింది.

Off-white Banner

Thanks For Reading...