Images source: google
మరికొద్ది రోజుల్లో సెప్టెంబర్ ముగుస్తుంది. అక్టోబర్ ప్రవేశిస్తుంది. ఈ సమయంలో విద్యార్థులకు దసరా సెలవులు లభిస్తాయి. ఉత్సాహంగా దక్షిణభారతాన్ని చుట్టేసి రండి.
Images source: google
కర్ణాటకలోని దట్టమైన అటవీ ప్రాంతాల్లో ఇది ఒకటి. కాఫీ తోటలకు, జలపాతాలకు ప్రసిద్ధి.. ఇక్కడ ట్రెక్కింగ్ చేసే సదుపాయం కూడా ఉంది.
Images source: google
కేరళ రాష్ట్రంలో దట్టమైన అటవీ ప్రాంతాల్లో వయనాడ్ కూడా ఒకటి.. ఇక్కడ మీన్ ముట్టి జలపాతం ప్రసిద్ధి చెందింది. ఇక్కడి కొండ ప్రాంతాలు ఆహ్లాదాన్ని కలిగిస్తాయి.
Images source: google
తూర్పు కనుమల ప్రాంతంలో అరకులోయ ప్రసిద్ధమైన పర్యాటక ప్రాంతం. ఇక్కడ కాఫీ తోటలు ప్రత్యేక ఆకర్షణ.
Images source: google
కర్ణాటకలోని అగుంబే ప్రాంతం దట్టమైన అడవులకు ప్రసిద్ధి.. ఇక్కడ క్రూర మృగాల నుంచి వన్యప్రాణులు వరకు జీవిస్తాయి. జలపాతాలు కనువిందు చేస్తాయి.
Images source: google
తమిళనాడులోని పిచ్చవరం ప్రాంతంలో మడ అడుగులు అద్భుతంగా ఉంటాయి. పడవల మీద వెళ్తూ ఈ అడవులను చూడటం సరికొత్త అనుభూతి.
Images source: google
చెంబ్రా కొండలు కేరళ రాష్ట్రంలో ప్రసిద్ధి చెందాయి. అక్టోబర్ కాలంలో ఇవి అత్యంత మనోహరంగా కనిపిస్తాయి. కొండలపైకి ట్రెక్కింగ్ చేయడం పర్యాటకులకు సరికొత్త అనుభూతి కలిగిస్తుంది.
Images source: google
పూర్తిగా కొండ ప్రాంతమైన వాల్పరై విస్తారమైన కాఫీ తోటలకు, తేయాకు తోటలకు ప్రసిద్ధి. ఇక్కడ దట్టమైన వృక్షాలు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తాయి.
Images source: google
పశ్చిమ కనుమల్లో కొడైకెనాల్ తర్వాత వట్టకనల్ అద్భుతమైన ప్రాంతం.. ఇది ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందిస్తుంది.. అక్టోబర్ మాసంలో మరింత అందంగా కనిపిస్తుంది.
Images source: google