భోజనం తినేటప్పుడు చివర్లో రెండు ముద్దలు అయినా పెరుగుతో తినాలి అనుకునేవారు చాలా మంది ఉంటారు.

మీలో కూడా పెరుగు ప్రియులు ఉన్నారా? అయితే చాలా ప్రయోజనాలు మీ సొంతం అవుతాయి. వాటిని తెలుసుకోండి.

మీ స్కిన్ చాలా గ్లో వస్తుంది. పెరుగు మీ స్కిన్ ను గ్లో చేయడంలో మంచి పాత్ర పోషిస్తుంది అంటున్నారు నిపుణులు.

ఈ రోజుల్లో చాలా మందికి ఫ్రీగా వస్తుంది బీపీ. ఈ బీపీని తగ్గించడంలో మీకు ఫ్రెండ్ గా ఉంటుంది పెరుగు.

పాలల్లో కాల్షియం ఉంటుంది అనేది తెలిసిందే. ఆ పాలతో తయారైన పెరుగును తినడం వల్ల కూడా సరైన కాల్షియం అంది ఎముకలు బలంగా ఉంటాయి.

బరువు తగ్గడానికి కూడా చాలా తోడ్పడుతుంది పెరుగు.

పెరుగు వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. యోని ఇన్ఫెక్షన్లు రాకుండా కూడా కాపాడుతోంది పెరుగు.

జీర్ణక్రియను మెరుగు పరిచి ఉదర సంబంధ సమస్యలను కూడా తొలగిస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న పెరుగును రోజు కాస్తైన తినాలి కదా..

Off-white Banner

Thanks For Reading...