మనదేశంలోని గ్రేటర్ నోయిడా వేదికగా న్యూజిలాండ్ - ఆఫ్ఘనిస్తాన్ మధ్య తొలి టెస్ట్ నిర్వహించాలని భావించారు.

Images source: google

మైదానం లో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో.. ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారింది. మురుగునీరు బయటకు వెళ్లే మార్గం లేకపోవడంతో మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాలేదు.

Images source: google

రెండు రోజులపాటు ఇదే పరిస్థితి ఉండడంతో.. టాస్ కూడా వేయలేదు. మూడో రోజు కూడా అదే పరిస్థితి ఉండడం.. పైగా వర్షం కురవడంతో మ్యాచ్ నిర్వహించలేదు.

Images source: google

రెండవ రోజు వాతావరణం పొడిగా ఉన్నప్పటికీ.. మైదానాన్ని సిద్ధం చేయడంలో సిబ్బంది పూర్తిగా విఫలమయ్యారు.

Images source: google

ఈ మైదానంలో మౌలిక వసతులు లేకపోవడం.. డ్రైనేజీ వ్యవస్థ సరి కాలేకపోవడంతో ఆఫ్ఘనిస్తాన్, న్యూజిలాండ్ అభిమానులు బీసీసీఐపై మండిపడుతున్నారు.

Images source: google

ఔట్ ఫీల్డ్ ను ఆరబెట్టేందుకు సరైన టార్పాలిన్లు కూడా లేవు. అనుభవం లేని సిబ్బంది ఫ్యాన్ సహాయంతో మైదానాన్ని ఆరబెట్టడానికి ప్రయత్నించారు.

Images source: google

ఈ గ్రౌండ్ లోని క్యాంటీన్ సిబ్బంది.. ఆహారం తిన్న తర్వాత ప్లేట్లను యూరినల్స్ వద్ద ఉన్న ట్యాప్ వద్ద కడిగినట్టు వార్తలు వినిపించాయి.

Images source: google

ఇన్ని వైఫల్యాలు కళ్ళ ముందు కనిపించిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ సిబ్బంది బీసీసీఐపై విమర్శలు చేశారు.

Images source: google

ఇక ఎన్నటికీ ఆఫ్ఘనిస్తాన్ భారత దేశంలో ఆడేందుకు రాదని ప్రకటించారు. సొంత మైదానం లేకపోయినప్పటికీ మరో దేశంపై ఆధారపడకూడదనే నిర్ణయానికి వచ్చినట్టు పేర్కొన్నారు.

Images source: google