Images source: google
రోడ్డు ప్రమాదానికి గురై.. సుదీర్ఘకాలం మంచానికి పరిమితమైన రిషబ్ పంత్ ప్రస్తుతం అదరగొడుతున్నాడు.
Images source: google
ఇటివలి ఐపిఎల్ లో ఢిల్లీ జట్టుకు పంత్ నాయకత్వం వహించాడు. టీమిండియా తరఫున కూడా సంచలన ఇన్నింగ్స్ ఆడుతున్నాడు.
Images source: google
వచ్చే సీజన్లో అతడు ఢిల్లీ జట్టు నుంచి బయటికి వస్తాడని క్రికెట్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.
Images source: google
దినేష్ కార్తీక్ రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో బెంగుళూరు జట్టు రిషబ్ పంత్ ను అతడి స్థానంతో భర్తీ చేయాలని చూస్తోంది.
Images source: google
వికెట్ కీపర్, కెప్టెన్ అయిన కె.ఎల్ రాహుల్ కు ఉద్వాసన పలకాలని లక్నో జట్టు భావిస్తోంది. అతడి స్థానంలో పంత్ ను కొనుగోలు చేయాలని యోచిస్తోంది.
Images source: google
ఒకవేళ పంత్ 2025 సీజన్లో వేలంలోకి వస్తే అతడిని కొనుగోలు చేయాలని పంజాబ్ జట్టు కూడా భావిస్తోంది.
Images source: google
మూడు జట్లు పోటీ పడుతున్న నేపథ్యంలో పంత్ 2025 సీజన్ లో వేలానికి వస్తే భారీ ధరకు అమ్ముడుపోయే అవకాశం ఉందని స్పోర్ట్స్ వర్గాలు చెబుతున్నాయి.
Images source: google
రిషబ్ పంత్ ఫార్మాట్ తో సంబంధం లేకుండా అద్భుతమైన ఫామ్ కొనసాగిస్తున్నాడు. అనితర సాధ్యమైన ఇన్నింగ్స్ ఆడుతూ టీమ్ ఇండియా విజయాలలో ముఖ్యపాత్ర పోషిస్తున్నాడు.
Images source: google