Images source: google
త్వరలో 2025 సీజన్ కు సంబంధించి వేలం నిర్వహించేందుకు ఐపీఎల్ నిర్వాహక కమిటీ ఏర్పాట్లు చేస్తోంది.
Images source: google
ఇప్పటికే అన్ని జట్ల యాజమాన్యాలతో పలుమార్లు సమావేశాలు నిర్వహించింది. రిటైన్ నిబంధనలపై, అన్ క్యాప్ద్ ఆటగాళ్ల విషయంలోనూ స్పష్టత ఇచ్చింది.
Images source: google
అయితే కొన్ని జట్లు ఐపిఎల్ 2025 సీజన్ ప్రారంభానికి ముందే అనేక మార్పులు, చేర్పులు చేపట్టాయి. ముఖ్యంగా కొత్త కోచ్ లను నియమించుకున్నాయి.
Images source: google
రాజస్థాన్ రాయల్స్ జట్టు తమ పూర్వ కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ ను కోచ్ గా నియమించుకుంది. ద్రావిడ్ మొన్నటి వరకు టీమ్ ఇండియాకు కోచ్ గా పనిచేశాడు.
Images source: google
పంజాబ్ కింగ్స్ జట్టు రికీ పాంటింగ్ ను కొత్త కోచ్ గా నియమించుకుంది. ఆయన ఇటీవల కాలం వరకు ఢిల్లీ జట్టుకు కోచ్ గా వ్యవహరించాడు.
Images source: google
ముంబై ఇండియన్స్ జట్టుకు మహేళ జయ వర్ధన కోచ్ గా నియమితుడయ్యాడు. గతంలో ఇదే జట్టుకు 2017 నుంచి 2022 వరకు కోచ్ గా జయవర్ధన పనిచేశాడు.
Images source: google
ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు హేమంగ్ బదానిని కోచ్ గా నియమించుకుంది. 2021 నుంచి 23 వరకు హైదరాబాద్ జట్టుకు బదాని బ్యాటింగ్, ఫీల్డింగ్ కోచ్ గా పనిచేశాడు.
Images source: google