భారీ వర్షాలు, వరదలతో ఆంధ్రప్రదేశ్ అతలాకుతలమైంది.

Images source: google

 రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు వంతెనలు కూలిపోయాయి. చెరువు పొంగిపొర్లుతున్నాయి.

Images source: google

దీంతో విజయవాడ తదితర రాజధాని ప్రాంతం పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకుంది.

Images source: google

మునుపెన్నడూ లేని విధంగా కురుస్తున్న వర్షాలకు ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లా, ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో భారీ నష్టం వాటిల్లింది.

Images source: google

 ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేని విధంగా వరద నీరు ఇళ్లు, కాలనీలను చుట్టుముట్టింది.

Images source: google

 నీటిలో చిక్కుకున్న వారిని బోట్ల సాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

Images source: google

వర్షాలతో వచ్చిన వరద నీటితో జాతీయ రహదారులు, రైల్వే కల్వర్టులు కూడా చాలా చోట్ల దెబ్బతిన్నాయి.

Images source: google

దీంతో ఏపీలోని పలు ప్రాంతాల్లో సహాయక సిబ్బంది, ప్రభుత్వ అధికారులు ప్రజలను ఆదుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.

Images source: google

180 ఏళ్లలో ఎన్నడూ లేని వర్షం కారణంగా విజయవాడలోని కృష్ణాలంక, రామలింగేశ్వరనగర్, యనమలకుదురు పూర్తిగా వరద నీటిలో మునిగిపోయాయి.

Images source: google