పిల్లలకు మీరు ఇచ్చే ఆహారం వల్లనే వారి శరీరం ఎదుగుతుంది. అయితే కొందరు పిల్లలు తింటున్నారు అని ఇష్టం వచ్చిన ఆహార పదార్థాలను తినిపిస్తుంటారు.
Images source: google
అప్పుడే పుట్టిన పిల్లల దగ్గర నుంచి ఆరు నెలల పిల్లల వరకు వారికి ఎలాంటి ఆహారాలు ఇవ్వకుండా కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలి. ఈ పాల వల్ల శిశువు శరీరానికి అవసరమైన పోషకాలు లభిస్తాయి.
Images source: google
ఆ తర్వాత 6 నెలలకు తేలికపాటి ఆహారం ఇవ్వడం ప్రారంభించాలి. ఈ దశ ప్రారంభంలో సెమీ లిక్విడ్ ఫుడ్ ఇచ్చినా సరే వారు మాత్రం ఆహారాలు కొరకడానికి ఇష్టపడుతుంటారు.
Images source: google
ముఖ్యంగా ఆవు పాలు పిల్లలకు చాలా మంచివి. కానీ సంవత్సరం లోపు పిల్లలకు ఈ ఆవుపాలను ఇవ్వకూడదు.
Images source: google
ఎందుకంటే శరీర పోషణకు అవసరమైన ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.. కాబట్టి ఆవు పాలను పిల్లలు జీర్ణించుకోలేరు. ఫలితంగా పిల్లలకు కడుపు ఉబ్బడం, కడుపు నొప్పి వంటి సమస్యలతో బాధ పడతారు.
Images source: google
తేనె: సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలకు చాలా మంది తేనె కూడా ఇస్తుంటారు. కానీ నవజాత శిశువులకు తేనె ఇవ్వడం వల్ల ప్రయోజనాలు కాదు కదా నష్టమే అంటున్నారు నిపుణులు.
Images source: google
ఫలితంగా పిల్లలకు బోటులిజం వస్తుంది అంటున్నారు నిపుణులు. దీనివల్ల కండరాలు బలహీనపడతాయి. మలబద్ధకం సమస్యలు వస్తాయట.
Images source: google
విటమిన్ సి పండ్లు: విటమిన్ సి పుష్కలంగా ఉండే పుల్లని పండ్లు రోగనిరోధక శక్తిని పెంచుతాయి.. కానీ పుల్లటి పండులో ఉండే విటమిన్ సి, సిట్రిక్ యాసిడ్ లు పిల్లలకు కడుపు నొప్పి సమస్యలను తెచ్చి పెడతాయి. విరేచనాలు అవుతాయి..
Images source: google