https://oktelugu.com/

వామ్మో వర్షాకాలం వచ్చింది దోమలు మొదలు అయ్యాయి. ఈ దోమలు కుట్టి  డెంగ్యూ, చికెన్ గున్యా, మలేరియా వంటి ఎన్నో వ్యాధులను తెచ్చిపెడుతాయి.

Images source: google

దోమల నుంచి కాపాడుకోవడానికి చాలా మంది కాయిల్స్, లిక్విడ్స్ వాడతారు. కానీ అందరికీ ఇవి వీటి స్మెల్ పడదు. మరి నేచురల్ గా దోమలను పోగొట్టుకోవడం ఎలా అనుకుంటున్నారా? అయితే చదివేసేయండి.

Images source: google

మొక్కలు : చెట్లు పెంచే అలవాటు ఉంటే బంతిపూలు, తులసి, లావెండర్, లెమన్ గ్రాస్, పిప్పర‌మెంట్, రోజ్మేరీ వంటి మొక్కలను ఎంచుకోండి. ఈ మొక్కలకు దోమలు దూరంగా ఉంటాయి.

Images source: google

వెల్లుల్లి: వెల్లుల్లిలో ఉండే సల్ఫర్ కంటెంట్ దోమలను దూరం చేస్తుంది. వెల్లుల్లి రసం కీటకాలని దూరం చేస్తుంది. వెల్లుల్లి రెబ్బల్ని నీటిలో ఉడికించి చల్లార్చి.. ఆ నీటిని స్ప్రే బాటిల్‌లో పోసి స్ప్రే చేస్తే ఈ ఘాటు వాసనకి దోమలు రావు.

Images source: google

కర్పూరం.. కర్పూరం  దోమల నుంచి దూరం చేస్తుంది. ఇంట్లో తలుపులు, కిటికీలు మూసి వేసి కర్పూరాన్ని కాల్చాలి. ఇలా చేయడం వల్ల వాటి వాసనకు దోమలు బయటకు వెళ్ళిపోతాయి. ప్రతి 2, 3 రోజులకి ఓ నీటి గిన్నెలో కర్పూరం మాత్రలు వేసి ఉంచినా సరే దోమలు రావు.

Images source: google

ఆరోమేటిక్ ఎసెన్షియల్ ఆయిల్స్.. ఎసెన్షియల్ ఆయిల్స్ అయిన లావెండర్, టీట్రీ, యూకలిప్టస్, పుదీనా ఎసెన్షియల్ లతో దోమలని తరిమికొట్టొచ్చు.

Images source: google

ఓ స్ప్రే బాటిల్‌లో  ఎసెన్షియల్ ఆయిల్స్‌ ను నింపి వాటిని ఇంట్లో స్ప్రే చేయాలి. లేదంటే ఇందులో కొబ్బరి నూనెను కలిపి కూడా వాడవచ్చు. వీటిలో కీటక నిరోధక లక్షణాల ఉంటాయి కాబట్టి దోమలు దరిచేరవు.

Images source: google

నిమ్మ, లవంగం.. నిమ్మకాయను సగానికి కట్ చేసి అందులో కొన్ని లవంగాలను గుచ్చాలి. వీటిని మీ ఇంట్లో అక్కడక్కడ పెట్టడం వల్ల దోమలు ఇంట్లోకి రావు.

Images source: google

 ప్రస్తుతం డెంగ్యూ, మలేరియా, ఫ్లూ వంటి ఎన్నో సమస్యలు వస్తున్నాయి. ఇది కేవలం అవగాహనకు మాత్రమే.. ఓకేతెలుగుకు దీన్ని నిర్ధారించడం లేదు..

Images source: google