https://oktelugu.com/

ఈప్రపంచంలో కేవలం మనుషులకు మాత్రమే భావోద్వేగాలు ఉంటాయి. జంతువులకు ఉండవని చాలామంది భావిస్తుంటారు. అయితే ఇది తప్పని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

Images source: google

మనుషులు ఎలా ఇష్టమైన వాళ్లను, బంధువులను కలిసినప్పుడు హత్తుకుంటారో ఏనుగుల అంతే. వాళ్ల స్నేహితులను చూసినప్పుడు తోక ఊపడం, సంతోషం ఎక్కువగా ఉంటే ఘీంకారనాదం చేస్తాయి.

Images source: google

స్నేహితులైన ఏనుగులు కలినప్పుడు ఒకరి తొండాలను ఒకరు పెనవేసుకుంటాయి. మానవులు ఎలా ప్రవర్తిస్తారో.. ఏనుగులు కూడా అలానే ప్రవర్తిస్తాయి. వీటి ప్రవర్తన దాదాపుగా మనుషుల్ని పోలి ఉంటుంది.

Images source: google

కుటుంబ సంరక్షణ కోసం గుంపులుగా మాత్రమే ఉంటాయి. పిల్లలను ఒంటరిగా వదిలేయవు. ఒక ఏనుగు మరోక ఏనుగతో మాట్లాడుతుంటాయి. వాటికి ఆకలి వేసినప్పుడు తల్లి ఏనుగుకి చెబుతాయి. గున్న ఏనుగులు యాక్షన్ చేస్తూ తల్లికి తమ ఆకలిని తెలియజేస్తాయి.

Images source: google

 తల్లులు తిడితే అలుగుతాయి. తల్లి వెంట వెళ్లకుండా ఎక్కడ పడితే అక్కడ ఆగిపోతాయి. మనుషుల్లానే ఏనుగులు కూడా పిల్ల ఏనుగులను బుజ్జిగిస్తేనే మళ్లీ తల్లులు మాట వింటాయి.  లేకపోతే అలుగుతూ చెప్పిన మాట వినకుండా ఉంటాయి.

Images source: google

ఏనుగులు వాళ్లకి ఇష్టమైన వాళ్లను కోల్పోతే ఏడుస్తాయట. ఒక మనిషి చనిపోతే ఎలా అతని చుట్టూ అందరూ కూర్చోని ఏడుస్తారో ఏనుగులు అంతే. ఒక ఏనుగు చనిపోతే దాని కళేబరం దగ్గర కూర్చోని అన్ని ఏనుగులు కన్నీరు కారుస్తాయి.

Images source: google

ఆ ఏనుగు కళేబరాన్ని మిగిలిన జంతువులు తినకుండా ఉండాలని అక్కడే కూర్చోని దానిని కాపాడుతాయి. అవసరమైతే ఏనుగుల గుంపు అంతా కలిసి ఆ కళేబరాన్ని పూడ్చిపెడతాయి.

Images source: google

వీటికి కేవలం భావోద్వేగాలు మాత్రమే కాకుండా తెలివి, జ్ఙాపకశక్తి కూడా ఉంటాయట. ఏనుగుల భావోద్వేగాలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వియన్నా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు ఓ అధ్యయనం చేశారట.

Images source: google

ఆఫ్రికా అడవుల్లోని ఏనుగుల్లో ఈ అధ్యయనం చేయగా మనుషుల వలె వీటికి కూడా భావోద్వేగాలు ఉన్నాయని తెలిసింది. ఈ అధ్యయంలో శాస్త్రవేత్తలు మొత్తం 1282 రకాల ప్రవర్తనలను గుర్తించారట.

Images source: google