https://oktelugu.com/

గుడ్డు, పనీర్ లో ఎటువంటి పోషకాలు ఉంటాయి. వీటి మధ్య తేడాలు ఎలా ఉంటాయి?

Images source: google

 గుడ్డు తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రొటీన్లు అందుతాయి. అందుకే చిన్న పిల్లల నుంచి పెద్దవారు ప్రతిరోజూ గుడ్డు తినడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి.

Images source: google

అలాగే పనీర్ లోనూ విలువైన పోషకాలు ఉన్నాయి. పనీర్ తో కర్రీతో పాటు వివిధ రకాల పదార్థాలు చేసుకుంటూ ఉంటారు. దీనిని కర్రీతో పాటు ఇతర స్వీట్లు కూడా చేసుకోవచ్చు. దీనిని తినడం వల్ల అదనపు శక్తి లభిస్తుందని చెబుతున్నారు.

Images source: google

ఒక గుడ్డులో 6 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇందులో శరీరానికి కావాల్సిన తొమ్మిది రకాల అమైనో అమ్లాలు ఉంటాయి. గుడ్డులో ఎక్కవగా కాల్షియం ఉంటుంది. ఇందులో ఎక్కువగా ప్రోటీన్లు ఉన్నప్పటికీ తొందరగా డైజేషన్ అవుతుంది.

Images source: google

కండరాల బలోపేతానికి, శరీర వృద్ధికి గుడ్డు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఒక గుడ్డులో తక్కువ మొత్తంలో క్యాలరీలు కలిగి ఉంటాయి. అందువల్ల దీనిని ఎక్కువగా తీసుకున్నా బరువు పెరిగే ఆస్కారం ఉండదు. గుడ్డును కొందరు శాఖాహారులు కూడా తీసుకోవచ్చు.

Images source: google

పనీర్ వెజ్ పదార్థం అయినప్పటికీ ఇందులో గుడ్డుతో సమానంగా పోషకాలు ఉంటాయి. పనీర్ లోనూ కాల్షియం అధిక మోతాదులో ఉంటుంది. వంద గ్రాముల పనీర్ లో 18 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. ఇది గుడ్డులో కంటే ఎక్కువ.

Images source: google

అయితే ఇది పాల పదార్థం. అందువల్ల ఇది తీసుకున్నప్పుడు జీర్ణం కావడానికి కాస్త సమయం పడుతుంది. అలాగే పనీర్ ను తగిన మోతాదులో మాత్రమే తీసుకోవాలి. ఇందులో క్యాలరీల శాతం అధికంగా ఉంటుంది.

FilIImages source: google

గుడ్డు , పనీర్ లో ఏదీ బెటర్ అనే విషయానికి వస్తే రెండు శరీరానికి ఆరోగ్యాన్ని ఇచ్చేవే. అయితే గుడ్డును డైట్ లాగా మార్చుకొని రోజుకో గుడ్డు తీసుకోవాలి. పనీర్ ను రకరకాల రెసిపీలు చేసుకుంటే టేస్టీగా తినొచ్చు.

Images source: google

అయితే జీర్ణసమస్యలు ఉన్న  వారు మాత్రం పనీర్ కు దూరంగా ఉండడం లేదా తక్కువ మోతాదులో మాత్రమే తీసుకోవాలి. అనారోగ్యాల సమయాల్లో గుడ్డుకు దూరంగా ఉండాలి. ప్రత్యేక వ్యాధులు ఉన్న వారు వైద్యుల సలహా మేరకే గుడ్డు తినాలి

Images source: google