బరువు తగ్గాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తారు. అందులో భాగంగా కాఫీలో నిమ్మరసం కూడా కలిపి తాగుతారు. మరి ఇలా చేయవచ్చా? అంటే చేయవచ్చు అంటున్నారు నిపుణులు.

Images source: google

కెఫిన్‌: కాఫీ తాగడంతో శరీర జీవక్రియల రేటు పెరుగుతుంది అంటున్నారు నిపుణులు. కాఫీలోని కెఫిన్‌ మొటబాలిజమ్‌ పెంచుతుంది. కొవ్వును కరిగిస్తుంది.

Images source: google

నిమ్మరసం: కెఫిన్‌కు నిమ్మరసం తోడైతే రెట్టింపు ఫలితం అందుతుంది. నిమ్మరసం కూడా జీవక్రియల రేటును పెంచడంలో సహాయం చేస్తుంది. పేరుకుపోయిన కొవ్వును కరిగిస్తుంది నిమ్మరసం.

Images source: google

ఎక్కువగా తాగొద్దు: బరువు తగ్గుతారని ఎక్కువ తాగితే జీర్ణ సమస్యలు వస్తాయి. ముఖ్యంగా ఎసిడిటీ సమస్య వస్తుంది జాగ్రత్త.

Images source: google

ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుంది: నిమ్మరసం కాఫీ తాగడం వల్ల ఇన్‌ఫ్లమేషన్‌ తగ్గుతుందట. ఈ కాఫీలోని యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని, వాపును కంట్రోల్‌ చేయడంలో సహాయం చేస్తాయి.

Images source: google

వ్యాధినిరోధకశక్తి: నిమ్మరసం కలిపిన కాఫీ తాగితే శరీరానికి కావాల్సిన విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి. వీటి వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.

Images source: google

మెరిసే చర్మం: ఈ కాఫీ వల్ల మెరిసే చర్మం కూడా పొందవచ్చు. నిమ్మరసంలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి టాక్సిన్లను తొలగిస్తాయి. తద్వారా చర్మం మెరుస్తుంది.

Images source: google

తయారీ: కాఫీ పెట్టి ఇందులో నిమ్మరసం పిండి బాగా కలిపాలి. అంతే సింపుల్ నిమ్మరసం కాఫీ రెడీ అయిపోయింది.

Images source: google