రోజూ ఉదయం లేచిన వెంటనే ఒక గ్లాసు వేడి నీరు తాగితే శరీరంలోని మలినాలు అన్ని పోయి చాలా హాయిగా ఉంటారు.
Images source: google
సాధారణంగా రోజుకి 4 లీటర్లు నీరు తప్పనిసరిగా తాగాలి. లేకపోతే చాలా నీరసం, అలసట వంటి సమస్యలు వస్తాయి. బాడీ డీహైడ్రేషన్ అయి.. రోగ నిరోధక శక్తి కూడా తగ్గిపోతుంది.
Images source: google
రాత్రి పూట నిద్రపోయే ముందు వేడి నీటిని తాగడం వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది. దీంతో శరీర రక్తప్రసరణ బాగా జరుగుతుంది. రోజూ ఇలా నీరు తాగడం వల్ల శరీరం నుంచి టాక్సిన్స్ తొలగిపోతాయి. అలాగే జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
Images source: google
వేడి నీరు తాగడం వల్ల తిన్న ఆహారం బాగా జీర్ణం అవుతుంది. దీంతో మలబద్దకం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే ఉదయం పూట మల విసర్జన ఫ్రీగా అవుతుంది.
Images source: google
అధిక బరువు ఉన్నవాళ్లు రాత్రి నిద్రపోయే ముందు గ్లాసు నీరుతో బరువు తగ్గవచ్చు. బరువు తగ్గడం కోసం మీరు ఎలాంటి మందులు వాడకుండా వేడి నీరుతో సింపుల్‌గా తగ్గించుకోవచ్చు.
Images source: google
అలాగే నిద్రలేమి సమస్య నుంచి కూడా బయటపడవచ్చు. రాత్రిపూట గ్లాసు వేడి నీరు తాగితే బాగా నిద్ర కూడా పడుతుంది.
Images source: google
Images source: google
రాత్రి పూట వేడి నీళ్లు తాగడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ తగ్గుతుంది. అలాగే మానసిక ఒత్తిడి, ఆందోళన నుంచి కూడా బయటపడవచ్చు. కడుపు నొప్పి, అజీర్తి, ఎసిడిటీ సమస్యలు కూడా వేడి నీటితో తగ్గుతాయి.
వేడి నీరు తాగడం వల్ల కిడ్నీలో రాళ్లు, మలబద్దకం, అర్షమొలలు వంటి సమస్యలు కూడా తగ్గుతాయి. నీరు ఎక్కువగా తాగడం వల్ల చర్మం కూడా కాంతివంతంగా మారుతుంది.
Images source: google
అయితే రాత్రిపూట వేడి నీరు లేదా చల్లని నీరు ఎక్కువగా తాగకూడదు. ఒక గ్లాసు మాత్రమే తాగాలి. ఎందుకంటే ఎక్కువగా నీరు తాగితే తరుచుగా మూత్రం వెళ్లాల్సి వస్తుంది. కాబట్టి రాత్రి పూట తక్కువగా మాత్రమే వేడి నీరు తీసుకోండి.
Images source: google