బిజీ లైఫ్ లో సరైన ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలా సమస్యలు వస్తున్నాయి. వ్యాయామం, సరైన ఆహారం తీసుకుంటే చాలా సమస్యల నుంచి దూరంగా ఉండవచ్చు.

Images source: google

సంతానోత్పత్తి రేటు చాలా వరకు తగ్గిపోతుంది. దీనికి కారణం కూడా ఆహారమే. అయితే సంతానోత్పత్తిని పెంచే ఈ గింజలను మీ డైలీ రొటీన్ లో చేర్చుకోండి. మరి అవేంటంటే..

Images source: google

నువ్వులు: జింక్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది సరైన కణ విభజన, పిండం పెరుగుదలకు అవసరం. నువ్వులు గర్భం కోసం శరీరాన్ని సిద్ధం చేస్తాయి.

Images source: google

పొద్దుతిరుగుడు విత్తనాలు: అవి విటమిన్ ఇ కి అద్భుతమైన మూలం. యాంటీఆక్సిడెంట్ లు ఉంటాయి. అభివృద్ధి చెందుతున్న శిశువు కణాలను దెబ్బతినకుండా రక్షిస్తుంది.

Images source: google

గుమ్మడికాయ గింజలు: సంతానోత్పత్తికి ముఖ్యమైన జింక్‌ అధికంగా ఉంటుంది. వాటిలో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు కూడా ఉన్నాయి. ఇవి శిశువు మెదడు, కంటి అభివృద్ధికి ముఖ్యమైనవి.

Images source: google

అవిసె గింజలు: లిగ్నాన్స్‌లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మొక్కల సమ్మేళనాలు. ఇవి హార్మోన్లను సమతుల్యం చేయడంలో, సంతానోత్పత్తిని ప్రోత్సహించడంలో సహాయపడతాయి.

Images source: google

చియా విత్తనాలు:  ఫైబర్ అద్భుతమైన మూలం.  గర్భధారణ సమయంలో మలబద్ధకాన్ని నివారిస్తుంది.

Images source: google

చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీఆక్సిడెంట్లు, మొక్కల ఆధారిత ప్రొటీన్లు కూడా పుష్కలంగా ఉన్నాయి.

Images source: google