Images source: google
ప్రతి ఒక్కరి ఇంట్లో ఆల్మోస్ట్ ఉదయం పాలు మస్ట్. టీ,కాఫీ, పాలు ఇలా ఏదో ఒక విధంగా సేవిస్తారు. అయితే అత్యధికంగా పాలు ఇచ్చే జాతి ఏంటో మీకు తెలుసా?
Images source: google
ప్రపంచంలోనే భారతదేశంలో ఆవుల సంఖ్య అత్యధికంగా ఉంది. ఇక్కడ పశువుల సంఖ్య 300 మిలియన్ల కంటే ఎక్కువగా ఉంటుంది. ఇక పాల ఉత్పత్తిలో భారతదేశమే మొదటి స్థానంలో ఉంది.
Images source: google
ప్రపంచం మొత్తంలో 24% భారత్ లోనే పాల ఉత్పత్తి జరుగుతుంది . ఆ తర్వాత అత్యధిక పాల ఉత్పత్తిలో రెండవ స్థానంలో అమెరికా నిలిచింది. ఆ తర్వాత చైనా, పాకిస్తాన్, బ్రెజిల్‌లు వరుస స్థానాలను అందుకున్నాయి.
Images source: google
భారతదేశం 213,779,230 టన్నుల ఆవు పాలను ఉత్పత్తి చేస్తే అమెరికా 102,747,320 టన్నులు, పాకిస్తాన్ 62,557,950 టన్నులు, చైనా 39,914,930 టన్నుల ఆవు పాలు ఉత్పత్తి చేశాయి అని సమాచారం.
Images source: google
ప్రపంచంలో 264 మిలియన్లకు పైగా పాలిచ్చే ఆవులు ఉన్నాయట. ఇవి సంవత్సరానికి 600 మిలియన్ టన్నుల పాలు అందించడంలో సహాయం చేస్తున్నాయి. ప్రతి ఆవు పాల ఉత్పత్తి ప్రపంచ సగటు సుమారు 2,200 లీటర్లుగా ఉంది.
Images source: google
అమెరికాలో ఒక ఆవుకు మించి మరొక ఆవు పాలు ఇస్తుంది. ఇక ప్రపంచంలోనే అత్యధికంగా పాలు ఇచ్చే హోల్‌స్టీన్ జాతి ఆవు కూడా అమెరికాకు చెందిన ఆవే. ఇది ఒకేసారి 90 నుంచి 100 లీటర్ల వరకు పాలు ఇస్తుందట.
Images source: google
ప్రపంచంలోని పాలిచ్చే ఆవులలో సుమారు 800 జాతులు ఉన్నాయి. ఇందులో నెంబర్ 1 స్థానంలో హోల్‌స్టీన్ ఆవులు నిలిచాయి. ఇవి సంవత్సరానికి 33000 లీటర్ల పాలు అందిస్తాయి. అమెరికా పాల ఉత్పత్తిలో ఈ ఆవు వాటా 90% ఉంది.
Images source: google