మగ దోమలు పువ్వుల నుంచి తేనెను తింటే... ఆడ దోమలు మాత్రం ఆహారం కోసం మనుషులను కుడతాయి.
Images source: google
దోమలు తమ గుడ్లను ఉత్పత్తి చేయడానికి మానవ రక్తంలోని కొన్ని ప్రోటీన్లను ఉపయోగిస్తుంటే ఆడ దోమ తన లాలాజలాన్ని మానవ రక్తంలోకి ఇంజెక్ట్ చేస్తుంది.
Images source: google
ఈ ఆడదోమ వల్ల మలేరియా, డెంగ్యూ, చికున్‌గున్యా, జికా వైరస్ వంటి ఇన్‌ఫెక్షన్‌లు వస్తాయి.
Images source: google
ఈ వైరస్ లలో కొన్ని అంటు వ్యాధులను ప్రేరేపించగల సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి.
Images source: google
అయితే ఇంట్లో కొందరు మాత్రమే దోమలు కుడుతున్నాయి అని ఎక్కువ చెబుతుంటారు. అందరికీ ఎక్కువగా దోమలు కుట్టవు. మరి దీనికి కారణం ఏంటో తెలుసా?
Images source: google
ఆడ దోమ తన దృష్టి, ప్రత్యేక యాంటెన్నా ద్వారా బాధితుడిని గుర్తిస్తుందట. ఇవి ఉష్ణ సంకేతాలు, కార్బన్ డయాక్సైడ్, తేమ, రసాయన వాసనలు, సంకేతాలను గుర్తిస్తాయి.
Images source: google
కళ్ళు, యాంటెన్నాలను ఉపయోగించి.. ఆడ దోమ అందరు మనుషుల్లో కెల్లా.. తనకు కావాల్సిన రక్తం ఉన్న మానవులను ఆకర్షిస్తుంది. మనలో కొందరికి దోమలు ఎక్కువగా కుట్టడానికి కారణం ఇదే అంటున్నారు నిపుణులు.
Images source: google
దోమలు లేత రంగుల కంటే ముదురు రంగు దుస్తులను ఎక్కువ లైక్ చేస్తాయట. ఎక్కువగా ఆకర్షితులవుతాయి.
Images source: google
మలేరియాకు కారణమయ్యే అనాఫిలిస్ దోమలు శరీరంలోని ఇతర భాగాల కంటే కాళ్లను కుట్టడానికి ఇష్టపడతాయి. కాబట్టి, వర్షాకాలం/ఫ్లూ అంటువ్యాధుల సమయంలో దుస్తులు నిండుగా ధరించడం మంచిది.
Images source: google