https://oktelugu.com/

హిందూ ధర్మం ప్రకారం మనం వ్రతాలు, యజ్ణాలు, హోమాలు, పూజలు చేయడం పరిపాటే. అన్నింట్లోనూ మనం మామిడి ఆకులు వాడతాం.

Images source: google

మామిడి ఆకులకు మన సనాతన ధర్మానికి దగ్గర సంబంధం ఉంది. అందుకే వాటినిని నిరంతరం వాడుతూనే ఉంటాం.

Images source: google

 కలశంలో కూడా మామిడి ఆకులు వేసి పూజ చేయడం సహజం. ఈ నేపథ్యంలో మామిడి ఆకుల ప్రాధాన్యం గురించి తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం కలుగుతుంది.

Images source: google

మామిడి ఆకులు శుభాలకు సంకేతంగా భావిస్తారు. మన పురాణాల్లో మామిడి ఆకులకు ప్రాధాన్యం ఇచ్చారు. మామిడి ఆకులు కోరికలను తీరుస్తుందని నమ్ముతారు. బ్రహ్మకు అర్పించిన వృక్షం ఇదే అని చెబుతారు.

Images source: google

కాళిదాసు ఈ చెట్టును గురించి వర్ణించాడు. మన్మథుడి పంచబాణాల్లో ఇది ఒకటిగా అభివర్ణించాడు. శివపార్వతుల కల్యాణం మామిడి చెట్టు కిందే జరిగిందట. అందుకే శుభ కార్యాల్లో మామిడి ఆకులను వినియోగిస్తారు.

Images source: google

శుభకార్యాలు, పండుగల సమయాల్లో గడపలకు పసుపు, కుంకుమ రాసి బొట్టు పెడతారు. గుమ్మాలపై పచ్చని మామిడి తోరణాలు కట్టడం సహజం. ఇలా చేయడం వల్ల ఇంట్లోకి ధనలక్ష్మి వస్తుందని నమ్మకం.

Images source: google

దేవతల సమూహమే మన ఇంటికి వస్తుందని అంటారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. దేవుళ్లు ఇంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంట్లోకి ధనం వస్తే ఆర్థిక సమస్యలు లేకుండా పోతాయి.

Images source: google

మామిడి ఆకులు కట్టడం వల్ల ప్రేమ, సంపద, సంతానాభివృద్ధి జరుగుతుంది. పురాతన ఇతిహాసాల్లో కూడా ఈ విషయాలు ప్రస్తావించారు.

Images source: google

 మామిడి, రావి, జువ్వి, మర్రి, ఉత్తరేణి ఆకులను పంచ పల్లవాలని చెబుతారు. వీటిని అన్ని శుభకార్యాల్లో వాడతారు. తోరణాలుగా కడతారు. ప్రతి పండగలో మాత్రం మామిడి ఆకులను తోరణాలుగా కట్టుకోవడం ఆనవాయితీ.

Images source: google