Images source : google
నీరు: తగినంత నీరు తాగకపోతే మూత్రం గాఢంగా మారుతుంది. దీనివల్ల రాళ్లు ఏర్పడే ప్రమాదం పెరుగుతుంది.
Images source : google
అధిక సోడియం: ఆహారంలో అధిక ఉప్పు మూత్రపిండాల్లో కాల్షియం పేరుకుపోయి రాళ్లు ఏర్పడటానికి దారితీస్తుంది.
Images source : google
ఆక్సలేట్ అధికంగా ఉండే ఆహారాలు - పాలకూర, గింజలు, చాక్లెట్లు వంటి ఆహారాలలో ఆక్సలేట్లు ఉంటాయి. ఇవి మూత్రపిండాల్లో రాళ్లు వచ్చేలా చేస్తాయి.
Images source : google
అధిక జంతు ప్రోటీన్ - ఎర్ర మాంసం, సముద్రపు ఆహారం ఎక్కువ తీసుకుంటే యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరుగుతాయి. దీని వల్ల మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి.
Images source : google
కాల్షియం సప్లిమెంట్లు - సరైన హైడ్రేషన్ లేకుండా కాల్షియం సప్లిమెంట్లను అధికంగా వాడటం వల్ల రాళ్లు ఏర్పడతాయి.
Images source : google
చక్కెర పానీయాలు & సోడా - సోడాలలో అధిక-ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ మూత్ర కూర్పును మార్చడం ద్వారా మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని పెంచుతుంది.
Images source : google
జన్యుపరమైన అంశాలు - వారసత్వంగా వచ్చే జీవక్రియ పరిస్థితుల కారణంగా మూత్రపిండాల్లో రాళ్ల వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.
Images source : google