https://oktelugu.com/

ఉప్పు తక్కువైనా, ఎక్కువైనా ఏం జరుగుతుందో తెలుసా.?

Images source: google

ఉప్పును మితంగా తీసుకోవాలి. లేదని అతిగా తీసుకుంటే మాత్రం విషంగా మారుతుంది. ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలు ఉప్పువారికి ఉప్పు చాలా ప్రమాదం అంటున్నారు నిపుణులు.

Images source: google

ఉప్పును అధికంగా తీసుకుంటే బీపీ కూడా పెరుగుతుంది. దీర్ఘకాలంగా ఇలాగే కంటిన్యూ అయితే గుండె సమస్యలు వస్తాయి.

Images source: google

ఉప్పు ఎక్కువైతే ప్రమాదం ఉన్నట్లే. పూర్తిగా తక్కువైనా కూడా ఇబ్బందులు వస్తాయి. ఉప్పు తక్కువగా తీసుకుంటే ఎలక్ట్రోలైట్ అసమతుల్యతకు దారి తీస్తుంది. దీనివల్ల కండరాల తిమ్మిరి, బలహీనత, మైకం వంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది.

Images source: google

శరీరంలో సోడియం తగ్గితే.. హైపోనట్రేమియాకు వచ్చే అవకాశం ఉందట. ఇది తలనొప్పి, వికారం, అలసట, గందరగోళం, మూర్ఛ వంటి సమస్యలు వస్తాయి.

Images source: google

శరీరంలో సరిపడా ఉప్పు లేకపోయినా ప్రమాదమే. దీనివల్ల శరీరంలో నీరు శాతం పెరుగుతుంది. దీంతో శరీరంలో వాపు వస్తుంది. కాళ్లు చేతుల్లో మరింత ఎక్కువ కనిపిస్తుంది ఈ వాపు

Images source: google

సోడియం తగ్గితే.. ఎముకల సాంద్రత తగ్గుతుంది. దీనివల్ల ఆస్టియోపోరోసిస్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.

Images source: google

ఉప్పు తీసుకోవడం పూర్తిగా మానేస్తే శరీరంలో థైరాయిడ్ సమస్యలు వస్తాయి. ఉప్పును కచ్చితంగా తీసుకోవాలి. కానీ మితంగా తీసుకోవాలి.

Images source: google