రాత్రి పడుకోవాల్సిన సమయంలో ఫోనే ప్రపంచం, సోషల్ మీడియానే జిందగీ అంటూ గడిపేస్తున్నారు.

18 సంవత్సరాలు పైబడితే 8 గంటలు నిద్ర పోవాల్సిందే అంటున్నారు నిపుణులు.

నిపుణులు చెప్పినా, అమ్మానాన్న అరిచినా మా మాటే వేరు. మేము చేసేదే వేదం అంటూ కేవలం 5 నుంచి 6 గంటలు మాత్రమే నిద్ర పోతున్నారు.

చెబితే వినకపోతే చెడంగ చూడాలి అంటారు పెద్దలు. అందుకే ఒక గంట నిద్ర కోల్పోతే దాని నుంచి కోలుకోవడానికి 4 రోజులు పడుతుందట.

అమ్మ హెడ్ ఎక్ టీ పెట్టనివ్వు అని ఉదయం అంటారు దీనికి కారణం రాత్రి పడుకోకపోవడమే

తలనొప్పి మాత్రమే కాదు శ్రద్ధగా పనిచేయకపోవడం, ఏకాగ్రత లోపించడం, చిరాకు వంటి లక్షణాలు అన్నీ కూడా నిద్ర లేకపోవడం వల్లనే అంటున్నారు నిపుణులు

సరైన నిద్ర ఆరోగ్యానికి చాలా ముఖ్యం కాబట్టి కచ్చితంగా ప్రతి రోజు 8 గంటలు నిద్రపోవాలి

రాత్రి నిద్రతో పాటు కాస్త మధ్యాహ్నం కూడా ఓ కునుకు తీయడం మరింత మంచిది అంటున్నారు నిపుణులు. కుదిరితే ట్రై చేయండి ఫ్రెండ్స్

Off-white Banner

Thanks For Reading...