ఓల్మ్, అరుదైన, అంతరించిపోతున్న గుహలో నివసించే సాలమండర్. ప్రపంచంలోనే అతిపెద్ద, భయంకరమైన గుహ జంతువుగా పేరు గాంచింది.

Image Source: Google

దీన్ని 'హ్యూమన్ ఫిష్' అని కూడా పిలుస్తారు. ఓల్మ్ స్లోవేనియా, క్రొయేషియా, ఇటలీలోని డైనరిక్ కార్స్ట్ గుహలలో ఎక్కువగా కనిపిస్తుంటాయి.

Image Source: Google

ఓల్మ్ అడుగు పొడవు ఉంటుంది. ప్రపంచంలోని విచిత్రమైన జంతువులలో ఒకటి.

Image Source: Google

ఓల్మ్ పూర్తిగా జలచరం. అంతేకాదు గుహల్లో ఉండే చీకటిలోనే దీని మొత్తం జీవితం గడిపేస్తుంటుంది. అలాంటి వాతావరణమే వీటికి ఇష్టమట.

Image Source: Google

వీటి చర్మంలో వర్ణద్రవ్యం ఉండదు. అందుకే ఇది పింక్ లేదా పసుపు-తెలుపు రంగుల్లో ఉంటుంది

Image Source: Google

ఓల్మ్‌లు పూర్తిగా గుడ్డివట. వాటి వైబ్రేషన్-సెన్సిటివ్ శ్రవణ వ్యవస్థను ఉపయోగించి చీకటిని నావిగేట్ చేస్తుంటాయి.

Image Source: Google

ఓల్మ్ ఒక ఆకస్మిక ప్రెడేటర్ అంటారు నిపుణులు. నిశ్శబ్దంగా ఉంటూ.. పూర్తిగా నిశ్చలంగా దాగి ఉంటాయి. ఇలా ఉంటూనే ఆహారం కోసం వేచి చూస్తాయి.

Image Source: Google

కొన్ని సందర్భాల్లో, ఓల్మ్‌లు ఒక దశాబ్దం పాటు కూడా ఆహారం లేకుండా జీవించగలవని పరిశోధనల్లో తేలింది.

Image Source: Google