https://oktelugu.com/

పోషకాలు పుష్కలం: కీరాలో పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. కీరా తింటే కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

Images source: google

హైడ్రేషన్‌: కీరదోసలో 95 శాతం నీరు ఉంటుంది కాబట్టి దీన్ని రెగ్యూలర్ గా తీసుకోవడం వల్ల శరీరం ఎప్పుడు హైడ్రేట్‌గా ఉంటుంది..

Images source: google

కేలరీలు తక్కువ: కీరదోసలో కేలరీలు చాలా తక్కువ. వీటిని రాత్రి తింటే బరువు తగ్గే అవకాశం ఉంటుంది.

Images source: google

జీర్ణ ఆరోగ్యం: కీరదోసలో ఫైబర్‌ ఎక్కువ. ఇది జీర్ణ సమస్యలను దూరం చేస్తుంది. మలబద్దకం, అజీర్తి వంటి సమస్యలకు చెక్ పెట్టవచ్చు.

Images source: google

బరువు తగ్గడానికి: బరువు తగ్గాలి అనుకుంటే కీరదోస చాలా మంచిది. కీరదోస తింటే ఆకలి నియంత్రణలో ఉంటుంది.

Images source: google

యాంటీ ఆక్సిడెంట్లు: కీరదోసలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చి.. కణాల ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తుంది.

Images source: google

మెరిసే చర్మం: కీరదోసలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఎక్కువ ఉంటాయి. ఇవి కణాలను ఆరోగ్యంగా మార్చి చర్మాన్ని మెరిసేలా చేస్తాయి.

Images source: google

షుగర్‌ కంట్రోల్: కీరదోసలోని ఫైబర్ రక్తంలో చక్కెర స్థాయిలను రెగ్యులేట్‌ చేస్తుంది కాబట్టి షుగర్‌తో బాధపడేవారు కీరదోస తినాలి.

Images source: google