బ్రెయిన్ సూపర్ ఫాస్ట్ అవ్వాలంటే ఇలా చేయండి..

Images source: google

ప్రస్తుతం చాలా మంది బ్రెయిన్ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మతిమరుపు ఎక్కువ వస్తుంది. మరి మీ బ్రెయిన్ షార్ప్ అవ్వాలంటే ఏం చేయాలంటే?

Images source: google

అలవాట్లు: కొన్ని అలవాట్ల వల్ల మెదడుకు హాని కలుగుతుంది. మొబైల్, బ్లాగ్‌లు, వెబ్‌సైట్‌లలో రోజంతా గడిపితే మెదడు మీద ప్రభావం పడుతుంది.

Images source: google

నిద్ర లేమి: సరైన నిద్ర లేకపోతే మెదడు మీద ప్రభావం పడుతుంది. దీని వల్ల  జ్ఞాపక శక్తి తగ్గుతుంది. సో మీకు 8 గంటల నిద్ర ముఖ్యం.

Images source: google

స్మార్ట్ ఫోన్: ఎక్కువ స్క్రీన్ సమయం వల్ల నిద్ర ప్రభావితం అవుతుంది. ఏకాగ్రత లోపిస్తుంది.అందుకే మొబైల్ వాడకం తగ్గించాలి. దీనికోసం కాస్త సమయం కేటాయించి ఆ సమయంలో మాత్రమే ఉపయోగించాలి.

Images source: google

ప్రాసెస్ చేసిన ఫుడ్: ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవద్దు. దీని వల్ల మెదడు పనితీరు మందగిస్తుంది.

Images source: google

హెడ్‌ఫోన్‌ల వాడకం: అధిక శబ్దంతో హెడ్‌ఫోన్‌లను ఉపయోగించవద్దు. వీటి వల్ల చెవులకే కాదు, మెదడు ఆరోగ్యానికి హానికరం అంటున్నారు నిపుణులు. దీని వల్ల చెవుడు వచ్చే ఆస్కారం కూడా ఉంది.

Images source: google

వ్యాయామం: మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే వ్యాయామం అవసరం. ధ్యానం, యోగా, విశ్రాంతి నిద్ర వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.

Images source: google