దిశా పటాని...టాలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా పాన్ ఇండియాలో ఉన్న అన్ని లాంగ్వేజేస్ లో సినిమాలు చేస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది.
ఆమెది ఉత్తరాది ప్రాంతం. ఉత్తరాఖండ్ సొంత రాష్ట్రం. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన లోఫర్ అనే సినిమాతోనే చిత్ర పరిశ్రమకు పరిచయమైంది.
లోఫర్ సినిమా ప్లాఫ్ కావడంతో ఆమెకు తెలుగులో అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ కు వెళ్ళిపోయింది.
అక్కడ ఎంఎస్ ధోని బయోపిక్ లో నటించింది. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో బాలీవుడ్లో ఆమెకు అవకాశాలు తలుపు తట్టాయి.
కుంగ్ ఫు యోగా, వెల్ కమ్ టు న్యూ యార్క్ బాఘి -2 , బాఘి - 3, భారత్, మలంగ్, ఏక్ విలన్ రిటర్న్స్అనే సినిమాల్లో నటించింది.
భాఘి సినిమా హీరో టైగర్ ష్రాప్ తో ఏర్పడిన పరిచయం ప్రేమకు దారి తీసింది. అప్పటినుంచి ఇప్పటివరకు అతనితో ఆమె రిలేషన్ లో ఉంది.
తెల్లటి ఉల్లిపోర దుస్తుల్లో దేవ కన్య లాగా మెరిసి పోతోంది. మెత్తటి, తెల్లటి పరుపు పై హొయలు పోతూ స్టిల్స్ ఇచ్చింది. వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.. దిశ అందాల ప్రదర్శన పై నెటిజన్లు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.