బెంగాల్ టైగర్ గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

Images source: google

బెంగాల్ టైగర్ లను చూశారా? కొన్ని పార్క్ లలో ఇప్పటీకి మీకు అందుబాటులో ఉన్నాయి. మరి వీటి గురించి కొన్ని వాస్తవాలు తెలుసుకుందాం.

Images source: google

బెంగాల్ టైగర్ ను పాంథెరా టైగ్రిస్ అని పిలుస్తుంటారు. ఇది మన భారతదేశ జాతీయ జంతువు. బలం, చురుకుదనం మాత్రమే కాదు ఇది దయకు ప్రసిద్ధి చెందింది.

Images source: google

విశాలమైన నలుపు చారలు, నలుపు చెవులు, పొడవాటి తోకతో మందపాటి పసుపు రంగు కోటు కలిగి ఉంటుంది ఈ బెంగాల్ టైగర్.

Images source: google

ఏ రెండు పులులకు ఒకే గీత నమూనా ఉండదు. ఇవి 110-120 అంగుళాల పొడవు వరకు పెరుగుతాయి. 397-569 పౌండ్ల వరకు బరువు ఉంటాయి.

Images source: google

రాయల్ బెంగాల్ టైగర్లు భారతదేశం, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లో కనిపిస్తాయి.  మడ అడవులు, చిత్తడి నేలలు, గడ్డి భూములలో నివసిస్తుంటాయి.

Images source: google

రాయల్ బెంగాల్ టైగర్స్ రాత్రి వేళ వేట ఎక్కువ చేస్తుంటాయి. వాటి విలక్షణమైన కోటులను మభ్యపెట్టేలా ఉపయోగిస్తుంటాయి.

Images source: google

1973లో, పులుల జనాభా తగ్గుతుండడంతో ఈ సమస్యను  పరిష్కరించాలని భారతదేశం 'ప్రాజెక్ట్ టైగర్'ను ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా టైగర్ రిజర్వ్‌లను ఏర్పాటు చేసింది.

Images source: google