https://oktelugu.com/

సాధారణంగా మనలో చాలామందికి ప్రకృతి అందాలను చూడడం చాలా ఇష్టం.. ఇందుకోసం ఎక్కడికైనా వెళ్తాం..

Images source: google

కానీ ప్రకృతి అందాలను కాకుండా.. ప్రకృతి విపత్తులను చూడ్డానికి వెళ్తే.. యుద్ధ సమయంలో వాతావరణం ఎలా ఉందో వీక్షించడానికి వెళ్తే.. అదేంటి ఇలా కూడా ఉంటారా.. అనే ప్రశ్న మీలో వ్యక్తమౌతూ ఉండొచ్చు.. కానీ ఇలాంటి వారు కూడా ఉన్నారు.

Images source: google

ఈ కాలంలో ఇలాంటి వాళ్లే ఎక్కువగా ఉన్నారు. దీనినే డార్క్ టూరిజం అని పిలుస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ టూరిజం మార్కెట్ విలువ పెరిగిపోతోంది. ఇలాంటి ప్రదేశాలను చూసేవారి సంఖ్య రెట్టింపవుతుంది.

Images source: google

మారణ హోమ క్షేత్రాలను చూసేందుకు పర్యాటకులు ఇష్టపడుతున్నారంటే.. డార్క్ టూరిజం మీద ఆసక్తి ఏ స్థాయిలో పెరుగుతుందో అర్థం చేసుకోవచ్చు.

Images source: google

డార్క్ టూరిజం విలువ ఈ ఏడాది 2.55 లక్షల కోట్ల వరకు ఉంటుందని పలు పర్యాటకరంగ ఏజెన్సీలు చెబుతున్నాయి. ఇది దాదాపుగా తెలంగాణ బడ్జెట్ కు సమానంగా ఉంది.

Images source: google

రష్యాతో ఉక్రెయిన్ చేస్తున్న యుద్ధాన్ని చూసేందుకు యువత ఏకంగా లక్షలు ఖర్చు చేసింది. కేరళలో వయనాడ్ ప్రాంతంలో సంభవించిన వరదలను చూసేందుకు ప్రజలు భారీగా తరలివచ్చారు. దీనికోసం భారీగానే ఖర్చు చేశారు.

Images source: google

ఇదంతా ఎందుకు అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. విషాద ఘటనలు, చారిత్రక అంశాలు, చీకటి అధ్యయనాలపై ఆసక్తి వల్లే డార్క్ టూరిస్టులు పెరుగుతున్నారని.. ప్రపంచం మొత్తం తెగ తిరుగుతున్నారని అధ్యయనాల ద్వారా తెలుస్తోంది.

Images source: google

2034 నాటికి డార్క్ టూరిజం విలువ 3.46 లక్షల కోట్లకు చేరుకుంటుందని పలు నివేదికల ద్వారా తెలుస్తోంది..

Images source: google

చరిత్రలో నిలిచిపోయిన చీకటి అధ్యాయాలపై చాలామందికి ఆసక్తి ఉంటుంది. చరిత్రలో జరిగిన తప్పుల గురించి తెలుసుకోవాలని కోరిక చాలామందిలో కలుగుతుంది. అనుభవం సంపాదించుకోవడం కోసం, విజ్ఞానాన్ని పొందడం కోసం చాలామంది డార్క్ టూరిజం వైపు అడుగులు వేస్తున్నారు.

Images source: google