కాఫీ డే : కాఫీ ఎలా పుట్టింది? దాంతో ప్రయోజనమేంటంటే?

Images source: google

  అక్టోబర్ 1వ తేదీన అంతర్జాతీయ కాఫీ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఈ కాఫీకి ఓ చరిత్ర ఉంది. అసలు కాఫీ ఎలా పుట్టింది? ఎవరు దీనిని మొదటిగా తయారు చేశారు? తెలుసుకుందాం.

Images source: google

దీని చరిత్ర? :  ఆల్ జపాన్ కాఫీ అసోసియేషన్ మొదటిసారిగా 1983లో కాఫీ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఆ తర్వాత చైనా, తైవాన్, నేపాల్ దేశాలు కాఫీ డేను జరుపుకున్నాయి.

Images source: google

ఇంటర్నేషనల్ కాఫీ ఆర్గనైజేషన్ 2015లో అక్టోబర్ 1వ తేదీని కాఫీ డేను ప్రకటించింది. అప్పటి నుంచి ప్రతీ ఏడాది కాఫీ దినోత్సవాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటున్నారు.

Images source: google

కాఫీ ఎక్కడ పుట్టింది? : ఈ కాఫీ ఇథియోపియాలో పుట్టింది. వేడి పానీయంగా కాఫీ బీన్‌లను తాగడం ప్రారంభించారు. అలా ప్రపంచ వ్యాప్తంగా కాఫీ ప్రాముఖ్యత సంతరించుకుంది.

Images source: google

భారతదేశంలో మొదటిగా కర్ణాటకలోని చంద్రగిరి కొండల్లో పుట్టింది. ఓ భారతీయ యాత్రికుడు మక్కాకు వెళ్లాడు. ఆ దేశాల నుంచి కాఫీ గింజలను తీసుకురావడం చట్టవిరుద్ధం. దీంతో వాటిని స్మగ్లింగ్ చేసి తీసుకొచ్చాడు.

Images source: google

అలా వచ్చిన కాఫీ భారతదేశంలో ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యునిగా మారిపోయింది. ప్రతి ఒక్కరూ ఇష్టంగా కాఫీని తాగుతారు. కాస్త ఒత్తిడిగా అనిపించిన మైండ్ రిలీఫ్‌ కోసం వెంటనే కాఫీ బాట పడతారు.

Images source: google

దీని ప్రాముఖ్యత : ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఇష్టపడే కాఫీ రైతుల కష్టాలు, పంట పండిన చేతికి రాని లాభం, అన్నింటి గురించి ప్రజలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో అంతర్జాతీయ కాఫీ దినోత్సవానికి గుర్తింపు ఇచ్చారు.

Images source: google