పిల్లలకు జలుబు, దగ్గు ఉందా? అయితే ఈ టిప్స్ పాటించండి.
Images source: google
తేనె, గోరువెచ్చని నీళ్లు: గోరువెచ్చని నీళ్లలో కొద్దిగా తేనె వేసి తీసుకోవాలి. ఇలా చేస్తే దగ్గు తగ్గుతుంది. నిద్రపోయే ముందు పిల్లలకు తాగించండి.
Images source: google
అల్లం, తులసి: అల్లంలో యాంటీ ఇంఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి. తులసి ఇన్ఫెక్షన్స్ నుంచి కాపాడుతుంది. నీళ్లు మరిగించి దంచిన అల్లం, తులసి ఆకులు వేసి ఈ మిశ్రమాన్ని పిల్లలకు తాగించాలి.
Images source: google
మిల్క్: పసుపులో ఉండే హీలింగ్ గుణాలు దగ్గు, జలుబును మాయం చేస్తాయి. గోరువెచ్చని పాలలో కొద్దిగా పసుపు వేసి పిల్లలకి ఇవ్వాలి.
Images source: google
ఆవిరి పట్టడం: పిల్లల చేత కొద్దిగా యూకలిప్టస్ ఆయిల్ లేదా తులసి వేసి ఐదు నిమిషాల పాటు ఆవిరి పట్టించాలి. ఇలా చేస్తే రిలీఫ్ కలుగుతుంది.
Images source: google
వాము: వాములో యాంటీ వైరల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు మెండుగా ఉంటాయి. వామును వేయించి ఒక క్లాత్‌లో చుట్టి పిల్లలు ఛాతిపై పెట్టాలి.
Images source: google
సూప్: చికెన్ సూప్ లేదా శాకాహారులైతే వెజిటేబుల్ సూప్ పిల్లలకు తాగించాలి. కాస్త వెల్లుల్లి, అల్లం కలిపి తాగిస్తే ఫాస్ట్ గా రిజల్ట్ వస్తుంది.
Images source: google
ఆవాల నూనె: గోరువెచ్చని ఆవాల నూనెలో వెల్లుల్లి, వాము వేసి స్ట్రైన్ చేసి మసాజ్ చేయాలి. ఇలా చేస్తే మంచి రిజల్ట్ ఉంటుంది.
Images source: google