పెరుగులో క్యాల్షియం, ప్రోటీన్, మెగ్నీషియం, ప్రోటీన్ లు పుష్కలంగా ఉంటాయి. ఇక ఎండ తాపం నుంచి బయటపడటానికి ఈ పెరుగుతో చేసిన డ్రింక్స్ చాలా అవసరం.

దీని వల్ల ఆరోగ్యానికి చాలా మేలు జరుగుతుంది. అంతేకాదు పొట్ట ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది పెరుగు.  ఈ పెరుగుతో  చేసుకునే పానీయాలను ఓ సారి చూద్దాం.

లస్సీ..  పెరుగును బాగా గిలక్కొట్టి నీరు తగినంత కలపాలి. ఈ నీటిలో కాస్త యాలకుల పొడి, కాస్త కుంకుమ పువ్వు, ఒక స్పూను పంచదార వేసి కలిపితే చాలు. అంతే లస్సీ రెడీ అయినట్టే.  రుచి కోసం మామిడి పండ్ల జ్యూస్ ను కలపవచ్చు.

పుదీనా మజ్జిగ..  పెరుగును బాగా గిలక్కొట్టి నీళ్లు వేసి కలిపితే చాలు మజ్జిగ లా అనిపిస్తుంది. అందులో అర స్పూన్ ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, పుదీనా తరుగు వేసి బాగా కలపాలి.  తాగితే  హాయిగా అనిపిస్తుంది.

స్మూతీ.. పెరుగును ఒక కప్పులో వేసి అందులో తేనె లేదా బెల్లం తురుము వేసి బాగా కలపండి. తర్వాత సన్నగా తరిగిన బెర్రీ పండ్లు, పైనాపిల్, అరటి పండ్లు వేసి దాన్ని తింటే టేస్టీగా ఉంటుంది.  మిశ్రమాన్ని గ్లైండర్ లో వేసి మెత్తగా స్మూతీగా మార్చుకొని తిన్నా రుచిగా ఉంటుంది.

పుచ్చకాయ పెరుగు స్మూతీ.. పెరుగును ఒక కప్పులో వేసి, పుచ్చకాయను చేత్తోనే సన్నగా నలిపి పెరుగులో వేసి కలిపి చియా గింజలను చల్లండి. ఈ మిశ్రమాన్ని ఫ్రిజ్ లో పెట్టండి. కాస్త చల్లగా అయిన తర్వాత తీసుకొని తినండి.

పెరుగు బనానా షేక్.. బాగా పండిన అరటి పండును ఒక బౌల్ లో వేసి పెరుగు కలపాలి. అందులో అరటిపండు గుజ్జును వేసి కలపాలి. తేనె, చిటికెడు దాల్చిన చెక్క పొడి వేసి బాగా కలిపి పైన వెనిల్లా ఐస్ క్రీమ్ ను ఒక స్కూప్ వేయండి. అంతే మీకు కావాల్సిన బనానా షేక్ రెడీ అయినట్టే.

ఇవి పిల్లలకు   బాగా నచ్చుతాయి.. ఇలాంటి పానీయాల వల్ల మీకు వేసవి తాపం తగ్గుతుంది. అంతేకాదు వడదెబ్బ నుంచి తప్పించుకోవచ్చు.

Off-white Banner

Thanks For Reading...