ప్రతి ఏడాది మే మొదటి సోమవారం న్యూయార్క్ లోని మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్ లో మెట్ గాలా నిర్వహిస్తారు.. ఈసారి కూడా అదే స్థాయిలో అంగరంగ వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ప్రపంచ వ్యాప్తంగా ఉన్న చిత్ర పరిశ్రమల నుంచి అందమైన నటీమణులు హాజరయ్యారు.  మెట్ గాలాకు హాజరైన నటీమణుల్లో ఎవరెవరు ఎలాంటి దుస్తులు ధరించారో ఈ కథనంలో తెలుసుకుందాం.

జెన్నీఫర్ లోపేజ్ ఈ హాలీవుడ్ నటిమణి ఈసారి తెలుపు, మేఘం రంగు కలబోసిన దుస్తులను ధరించింది.  స్కీయా పరెల్లి అనే పాట వినిపిస్తుండగా.. హొయలు ఒలికిస్తూ అభిమానులను అలరించింది.

జెండయా.. ఈ హాలీవుడ్ అందం.. అచ్చం నెమలి పించం రంగులను పోలి ఉన్న దుస్తులు ధరించింది. అక్కడక్కడ తన దేహంపై సీతాకోకచిలుకలను (ఆర్టిఫిషియల్)  అలంకరించుకుంది.

కార్డ్ బీ టల్లే నలుపు రంగు కలిగిన కలిగిన గౌన్ ధరించింది. ఆ డ్రెస్ చూసేందుకు భారీ ట్రైన్ ను తలపించింది. డ్రెస్ కు తగ్గట్టే ఆమె ఆభరణాలు ధరించింది. తలకు తలపాగా చుట్టుకుంది.

కిమ్ కర్దాషియాన్ భుజాల వరకు లంపి గ్రే స్వెట్టర్ వేసుకుంది. మై సన్ మార్గిలా లీఫ్ తో అలంకరించిన సిల్వర్ కలర్ కార్సెట్ ను ధరించి దేవత లాగా మెరిసిపోయింది.

క్రిస్ హెమ్ వర్త్ ఈ హాలీవుడ్ అందగాడు తెలుపు, గోధుమ రంగులో ఉన్న ట్రామ్ ఫోర్డ్ సూట్ వేసుకొని ఆకట్టుకున్నాడు. హెయిర్ స్టైల్ కూడా ఆ డ్రెస్ కు తగ్గట్టే ఉంది.

పెనో లోప్ క్రజ్ నలుపు, నీలం రంగు కలబోతతో రూపొందించిన గౌన్ ధరించి ఆకట్టుకుంది. దానిపై తెలుపు రంగు ఎంబ్రాయిడరీ సరికొత్త అందాన్ని తీసుకొచ్చింది.

సెరేనా విలియమ్స్ ఈ వెటరన్ టెన్నిస్ దిగ్గజం  మెటాలిక్ గోల్డ్ కలర్లో షోల్డర్ స్టేట్మెంట్ ను ప్రదర్శించేలా డ్రెస్ ధరించి ఆకట్టుకుంది. రెండు చేతులకు ఫుల్ హ్యాండ్ బ్లాక్ గ్లవ్స్ ధరించింది.

సారా జెస్సికా పార్కర్ అద్భుతమైన శిల్పాలు పొదిగినట్టుగా ఉన్న తెలుపు రంగు గౌన్ ధరించి అలరించింది.

ఆరియానా గ్రాండే తెలుపు రంగు స్లీవ్ లెస్ గౌన్ తో అభిమానులను అలరించింది. తన రెండు కనురెప్పలపై త్రీడీలో రూపొందించిన రెక్కలను జతచేసుకుంది.

ఆషర్ నల్లటి బ్రూచ్ ధరించి ఆకట్టుకున్నాడు. చేతిలో గులాబీ పువ్వుతో అలరించాడు. తలపై క్యాప్ ధరించి  సిసలైన రోమన్ లాగా దర్శనమిచ్చాడు.

అయ్యో ఎడబెరి ఈ అమెరికన్ హాస్యనటి తన ఒంటిపై పూల తోటను ప్రదర్శించింది. అందమైన పూలను ఎంబ్రాయిడరింగ్ చేసిన డ్రెస్ ధరించి అభిమానులను సమ్మోహనులను చేసింది.

డ్యూ యా లిపా రాక్ ఎన్ రోల్ మాదిరి నలుపు రంగు డ్రెస్ ధరించి అదరగొట్టింది. మధ్య మధ్యలో మెరిసిపోతున్న చంకీలు ఆమెకు సరికొత్త అందాన్ని తీసుకొచ్చాయి.

డేమి మూర్ హరీస్ నలుపు, గులాబీ రంగుతో రూపొందించిన దుస్తులను ధరించింది. ఆ దుస్తులకు రెక్కలను రూపొందించుకొని.. మరింతగా ఆకట్టుకుంది.

కెండల్ జన్నర్ నలుపు రంగు డ్రెస్సులో ఆకట్టుకుంది. ఈ గీవెన్చి లుక్ ఆమెను మరో స్థాయికి తీసుకెళ్లింది.

ఆలియా భట్ సంక్లిష్టంగా అల్లిన చిన్న చిన్న జడలతో  ఆలియా ఆకట్టుకుంది. గార్డెనింగ్ థీమ్ లో భాగంగా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి అలరించింది. ఈ ఫోటోలను తన ఇన్ స్టా లో షేర్ చేసింది.

Off-white Banner

Thanks For Reading...