మనలో చాలా మందికి పెరుగు తినే అలవాటు ఉంటుంది. పెరుగులో మనకు ఎన్నో పోషకాలు ఉంటాయి. కాబట్టి పెరుగు తినడం ఆరోగ్యానికి మంచిదే.
Images source: google
రాత్రి పూట పెద్ద మొత్తంలో కాకుండా కొంచెం పెరుగు తింటే మంచిది. పొద్దంతా పెరుగు తింటే ఎలాంటి నిబంధనలు ఉండవు. పెరుగులో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి.
Images source: google
పెరుగులో కాల్షియం, విటమిన్ బి2, పొటాషియం, మెగ్నిషియం వంటి పోషకాలు మెండుగా ఉంటాయి. ఇందులో ఉండే ప్రొబయోటిక్ వల్ల మన జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
Images source: google
పెరుగు మన కడుపు, పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులో గుడ్ బ్యాక్టీరియా ఉండటం వల్ల మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఒక రోజు పులియబెట్టిన పెరుగులో మంచి బ్యాక్టీరియా ఉండటం వల్ల మేలు కలిగిస్తుంది.
Images source: google
రోజు పెరుగు తినడం వల్ల రోగ నిరోదక శక్తి పెరుగుతుంది. తుమ్ములు, జలుబు, జ్వరం వంటివి రాకుండా చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. పెరుగు తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదం నుంచి కూడా రక్షించుకోవచ్చు.
Images source: google
మధుమేహానికి కూడా పెరుగు ఔషధంలా పనిచేస్తుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సహకరిస్తుంది.
Images source: google
పెరుగు తినడం వల్ల అధిక రక్తపోటు కూడా కంట్రోల్ లో ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం, మెగ్నిషియం అధికంగా ఉండటంతో బీపీ నియంత్రణలో ఉంటుంది.
Images source: google
కాల్షియం ఉండటం వల్ల ఎముకలు, దంతాలు బలంగా ఉంటాయి. ఉదయం పూట తీసుకోవడం వల్ల మన శరీరం ఎనర్జిటిక్ గా మారుతుంది. బరువు పెరిగేందుకు కూడా ఇది దోహదం చేస్తుంది.
Images source: google
పెరుగుతో మొటిమలను నివారించుకోవచ్చు. ఒక టీ స్పూన్ కాపీ పొడిలో చిటికెడు పసుపు, ఒక టీ స్పూన్ పెరుగు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. ఇరవై నిమిషాల తరువాత కడుక్కుంటే మొటిమలు మాయమవుతాయి.
Images source: google