https://oktelugu.com/

మనిషికి తిండి ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం. అందుకే రోజుకు కనీసం 7-9 గంటలు నిద్రపోవాల్సిందే.

Images source: google

నిద్రలో మన అవయవాలు అన్ని సర్దుకుంటాయి. వాటి మరమ్మతులు అవిచేసుకుంటాయి. దీంతో మరునాడు ఫ్రెష్ గా ఉండేందుకు కారణమవుతుంది.

Images source: google

నిద్రలో మనకు చాలా లాభాలుంటాయి. మన మెదడు కూడా రిలాక్స్ గా ఉంటుంది. ఎలాంటి ఆలోచనలు లేకుండా సేద తీరుతుంది. దీంతో ఉదయం లేవగానే మంచి ఆలోచనలతో నిండిపోతోంది.

Images source: google

ప్రస్తుతం అందరు ఫోన్లకు అలవాటు పడిపోయారు. తెల్లవారే వరకు ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. అర్థరాత్రి వరకు ఫోన్ చూస్తే నిద్ర మీద కూడా ప్రభావం పడి నిద్ర కరువవుతోంది.

Images source: google

మనకు సరైన నిద్ర పట్టడానికి వాతావరణ ప్రభావం కూడా ఉంటుంది.

Images source: google

ఎండాకాలంలో ఉక్కపోతకు సరిగా నిద్రపట్టదు. వర్షాకాలం, చలికాలంలో అయితే నిద్ర బాగా పడుతుంది.

Images source: google

పడక గది కూడా సరిగా ఉండాలి. వెలుతురు లేకుండా చీకటి ఉండేలా చూసుకుంటే నిద్ర బాగా పడుతుంది. గదిలో వెలుతురు ఉంటే సరిగా నిద్ర రాదు.

Images source: google

నిద్రలేమితో చాలా సమస్యలొస్తాయి. అందుకే మంచి నిద్ర పోవడానికే మొగ్గు చూపాలి.

Images source: google

పగటి పూట ఎక్కువ సేపు నిద్ర పోకూడదు. మధ్యాహ్నం ఎక్కువ సమయం పడుకుంటే రాత్రి సరిగా నిద్ర పట్టక ఇబ్బందులు పడాల్సి వస్తోంది.

Images source: google