అన్ని దేవుళ్లకంటే ఆదిదేవుడు వినాయకుడే. గణపతికి పూజ చేస్తే కోరిన కోర్కెలు తీరుస్తాడని భక్తుల విశ్వాసం. గణపతిని పూజ చేసేందుకు కొన్ని నియమాలు కూడా ఉన్నాయి..
Images source: google
తెల్లజిల్లేడు చెట్టుతో చేసిన గణపతి విగ్రహాన్ని శ్వేతార్క గణపతి అంటారు. దీంతో ఆర్థిక ఇబ్బందులు, శత్రుబాధలు తొలగిపోతాయని చెబుతారు.
Images source: google
శ్త్వేతార్క గణపతిని పూజిస్తే సంపదలు, సుఖశాంతులు లభిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. తెల్లజిల్లేడు చెట్టును ఇంట్లో కూడా నాటుకుని ప్రతి రోజు పూజ చేస్తారు. దీనికి ఉన్న విలువ అలాంటిది.
Images source: google
శ్వేతార్క గణపతిని ఇంట్లో ప్రతిష్టించుకోవాలంటే ముహూర్తం చూసుకోవాలి. పండితులను కలిసి మంచి సమయం చూసుకుని ఇంట్లో ప్రతిష్టించుకోవాల్సి ఉంటుంది. దీంతో సకల శుభాలు కలుగుతాయి..
Images source: google
శ్వేతార్క గణపతి పూజలో కూడా కొన్ని నిబంధనలు ఉంటాయి. శ్వేతార్క గణపతిని శుభ్రంగా కడిగి ఎర్రని వస్త్రంపై ఉంచి ధూపదీప నైవేద్యాలతో పూజిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగుతాయని విశ్వాసం.
Images source: google
జిల్లేడుతో చేసిన గణపతితో జాతక చక్రంలో సూర్యుడు నీచస్థితిలో ఉన్నవారు, ఇంటికి వీధిపోటు, వాస్తు దోషాలు ఉంటే శ్వేతా గణపతిని పూజిస్తే అన్ని దూరమవుతాయి.
Images source: google
తెల్ల జిల్లేడును పవిత్రంగా భావిస్తారు. దాని ఆకులను కూడా పూజలో వినియోగిస్తారు. జిల్లేడు సిరిసంపదలకు చిహ్నంగా సూచిస్తారు.
Images source: google
అందుకే తెల్ల జిల్లేడు చెట్టుతో చేసిన గణపతికి ఎంతో ప్రాశస్త్యం ఉంటుందని తెలుసుకుని అందరు తమ ఇళ్లల్లో ప్రతిష్టించుకునేందుకు ఆలోచిస్తున్నారు.
Images source: google
ఇంట్లో పెట్టుకుని నిత్యం పూజలు చేసి అన్నింట్లో విఘ్నాలు లేకుండా చేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Images source: google