ప్రజలు తమ అభిమాన తారల గురించి.. వారు తమ ఇంటిలో ఎలా నివసిస్తున్నారు అనే దాని గురించి తెలుసుకోవాలని ఎల్లప్పుడూ ఆసక్తిగా ఉంటారు. వారి విలాసవంతమైన బంగ్లాలు ఎక్కడ ఉన్నాయి? వారు తమ ఇళ్లను ఎలా నిర్వహిస్తున్నారన్నది తెలుసుకోవాలనుకుంటారు..

దేశంలో నివసిస్తున్న సెలబ్రిటీల బంగ్లాల గురించి స్పెషల్ స్టోరీని తెలుసుకుందాం..   భారతదేశంలో అత్యంత ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌ను కలిగి ఉన్న ముంబైలోని కొన్ని ప్రత్యేక ప్రాంతాలను ఈ తారలు ఎంచుకున్నారు..

అమితాబ్ బంగ్లా పేరు ‘జల్సా’ మిలీనియం సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్‌కు ముంబైలోనే 5 ఇళ్లు ఉన్నాయని చెబుతారు. అయితే జల్సా అనేది కుటుంబం మొత్తం నివసించే భవనంగా ముంబైలో అత్యంత విలాసవంతంగా ఉంది. దీని విలువ: రూ. 112 కోట్లు

సల్మాన్ ఖాన్ అపార్ట్ మెంట్ సల్మాన్ ఖాన్ బాంద్రాలో షారుఖ్ - బిగ్ బి ఇళ్లకు సమీపంలో గెలాక్సీ అపార్ట్‌మెంట్స్ లో ఉంటారు. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ ఇల్లు ఇదే. భాయ్ తన అభిమానులను పలకరించడానికి 1వ అంతస్తులోని వరండాలో తరచుగా బయటకు వస్తాడు.  గతంలో 32 కోట్లతో సల్మాన్ ఇల్లు కొనుక్కున్నాడని సమాచారం. ప్రస్తుత విలువ: రూ. 100 కోట్లు

అమీర్ ఖాన్ అమీర్ ఖాన్ పాలి హిల్‌లోని తన ఇల్లును ప్రస్తుతం పునర్నిర్మిస్తున్నారు. అందుకే బాంద్రాలోని కార్టర్ రోడ్‌లోని ఫ్రీడా అపార్ట్‌మెంట్స్‌లో అద్దెకు తీసుకున్నాడు. ఇది సముద్రతీరంలో ఆహ్లాదంగా ఉంటుంది.  ఈ ఫ్లాట్‌లోకి మారిన నెలల తర్వాత నటుడు దీన్ని కొనుగోలు చేసినట్లు సమాచారం. దీని విలువ: రూ. 60 కోట్లు

అక్షయ్ కుమార్ ‘స్వీట్ హోట్’ అక్షయ్ కుమార్ ఇల్లు పేరు ‘స్వీట్-హోమ్’. ఇది జుహులోని ప్రైమ్ బీచ్‌లో సముద్రానికి ఎదురుగా ఉన్న డ్యూప్లెక్స్ ఫ్లాట్‌. ఇక్కడే అక్షయ్ కుటుంబం నివసిస్తుంది.

రిషి కపూర్ ‘కృష్ణ రాజ్’ రిషి కపూర్ రిషి- నీతూ కపూర్ లు కృష్ణ రాజ్ వద్ద నివసిస్తున్నారు. ఇది మూడు దశాబ్దాలుగా కపూర్ కుటుంబం ఇక్కడే ఉంటుంది. పాలి హిల్‌లోని ఎత్తైన ప్రాంతంలో ఉన్న భవనాల్లో ఇది ఒకటి.

జాన్ అబ్రహం జాన్ అబ్రహం  పెంట్ హౌస్ లో ఉంటారు.  ఎంతో ఇష్టంగా ఇల్లు నిర్మించాడు. అతడి సోదరుడు - తండ్రి  రూపొందించిన ఈ అద్భుతమైన పెంట్ హౌస్ నుంచి అరేబియా సముద్రం అద్భుతమైన దృశ్యాలు , అందమైన ప్రకృతి దృశ్యాలు కనిపిస్తాయి. లోపల వెలుపల  ప్రకృతికి సోపానంగా తీర్చిదిద్దారు.   దీని విలువ ఖచ్చితంగా నిర్ణయించలేదు.

షారుఖ్ ఖాన్ ‘మన్నత్’ బాలీవుడ్ కింగ్ షారుక్ ఖాన్ తన జీవితాన్ని కింగ్ సైజ్‌గా గడిపేస్తుంటాడు. ‘మన్నత్’ అని పిలవబడే ఈ భవనం ముంబయిలోని బాంద్రాలో ఉంది. దీనిని ఎప్పటికీ కూల్చివేయకుండా ఒక వారసత్వ ప్రదేశంగా కూడా షారుఖ్ మార్చేశాడు. దీని విలువ: రూ. 200 కోట్లు

Off-white Banner

Thanks For Reading...