అనేక పక్షులు అధిక-ఎత్తులో ఎగరడానికి అనువుగా ఉంటాయి. కొన్ని పక్షుల జాతుల రెక్కలు, వాటి శరీరం ఎక్కువ కాలం పాటు ఎత్తులో ఎగిరేందుకు సహాయం చేస్తాయి.
Images source: google
అత్యధికంగా ఎగిరే కొన్ని పక్షి జాతుల గురించి తెలుసుకుందాం. అవి ఏకంగా విమాన ఎత్తుకు కూడా ఎగరగలవు.
Images source: google
రుప్పెల్స్ గ్రిఫిన్ రాబందు (11,275 మీటర్లు): ఈ ఎత్తులో ఉన్న వాణిజ్య విమానాన్ని ఢీకొని అత్యధిక ఎత్తులో ప్రయాణించిన రికార్డును సొంతం చేసుకుంది.
Images source: google
సాధారణ క్రేన్ (10,000 మీటర్లు): యురేషియాలో ఉండే పక్షి సుదీర్ఘ వలసలకు ప్రసిద్ధి చెందింది. తరచుగా హిమాలయాల మీదుగా ఎగురుతుంది ఈ పక్షి.
Images source: google
బార్-హెడెడ్ గూస్ (8,992 మీటర్లు): ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండే హిమాలయాల ఎత్తుకు కూడా ఎగరగలదు. ఎత్తైన విమానాలను అందుకోగలదు.
Images source: google
హూపర్ స్వాన్ (8,230 మీటర్లు): ఈ హంసలు బలమైన ఫ్లైయర్స్. వలస సమయంలో చాలా ఎత్తులో ఎగురుతాయి.
Images source: google
ఆల్పైన్ చౌఫ్ (8,077 మీటర్లు): తరచుగా హిమాలయాల శిఖరాల చుట్టూ ఎగురుతూ కనిపిస్తుంది. ఇది పర్వత ప్రాంతాలకు అనుగుణంగా ఉండే పక్షి.
Images source: google
గడ్డం రాబందు (7,315 మీటర్లు): ఈ స్కావెంజర్ పర్వత ప్రాంతంలోని ఎత్తైన ప్రదేశాలలో నివసించే, ఎగరగల సామర్థ్యానికి ప్రసిద్ధి చెందిన పక్షి.
Images source: google