చాలామంది విహారయాత్ర అంటే స్విట్జర్లాండ్.. లేదా ఇతర దేశాలకు వెళుతుంటారు. కానీ మనదేశంలోనూ అంతకు మించి అనే విహార ప్రదేశాలున్నాయి. ఇండియాలోనే ఉన్నప్పటికీ విదేశాల్లో విహరిస్తున్న అనుభూతిని కలిగిస్తుంటాయి. ఇంతకీ అవేంటంటే..

ఖజ్జియార్ ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. చుట్టూ మంచుకొండలు.. ఆకాశాన్ని తాకే విధంగా ఉన్న వృక్షాలు.. సెలయేళ్లతో స్విట్జర్లాండ్ లాగా కనిపిస్తుంది. ఈ ప్రాంతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువ. అందమైన ప్రదేశంగా ఇది ఒక స్వర్గధామం.

లక్షద్వీప్ ఆ మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించింది ఈ ప్రాంతాల్లోనే. మాల్దీవులకు మించి ప్రకృతి రమణీయత ఈ ప్రాంతం సొంతం. అందమైన దీవులు.. వాటిని దాకే సముద్ర జలాలు.. చూసేందుకు ఆ దృశ్యాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి.

గుల్మార్గ్ జమ్మూ కాశ్మీర్లోని బారా ముల్లా జిల్లా ప్రాంతంలో గుల్మార్గ్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా మంచు కురుస్తూనే ఉంటుంది. ఆ దృశ్యాలను చూసేందుకు ఎక్కడెక్కడ నుంచో పర్యాటకులు వస్తుంటారు. ఇండియన్ స్విట్జర్ లాండ్ గా పిలుస్తుంటారు.

శ్రీనగర్ మార్కెట్.. శ్రీనగర్ మార్కెట్ పండ్లు, ఫలాలకు ప్రసిద్ధి చెందింది. బోట్ లో ప్రయాణించి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ వాటిని కొనుగోలు చేస్తుంటారు. కొంతమంది దానిని బ్యాంకాక్ బోట్ మార్కెట్ గా అభివర్ణిస్తుంటారు.

మున్నార్ తేయాకు తోటలకు మున్నార్ హిల్స్ ప్రసిద్ధి. ఎత్తైన కొండల మధ్య తేయాకు మొక్కలు ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంగా కనిపిస్తాయి. ఇవి చూసేందుకు మలేషియాలోని కామెరాన్ హైలాండ్స్ లాగా కనిపిస్తాయి.

షిల్లాంగ్ మేఘాలయ రాష్ట్ర రాజధాని అయిన ఈ ప్రాంతాన్ని "స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్" అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఉన్న చాలా ప్రదేశాలు స్కాట్లాండ్ లో ఉన్న వాటిని పోలి ఉంటాయి.

మలానా మలానా అనేది హిమాచల్ ప్రదేశ్ లోని ఒక హిల్ స్టేషన్.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం చూసేందుకు గ్రీస్ నగరాన్ని పోలి ఉంటుంది.

పుదుచ్చేరి తమిళనాడుకు సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ఫ్రెంచ్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఫ్రెంచ్ పాలకులు ఎక్కువగా పాలించడంతో ఇక్కడ చేపట్టే ప్రతి నిర్మాణం ఫ్రెంచ్ దేశంలో మాదిరి ఉంటుంది. ఈ ప్రాంతంలో విహరిస్తే ఫ్రెంచ్ దేశంలో నడిచినట్టే ఉంటుంది.

Off-white Banner

Thanks For Reading...