ఎండలు దంచికొడుతున్నాయి.. బయటకు వెళితే మాడి మసైపోతున్నాం..

ఇలాంటి సమయంలో ఆరోగ్యంపై శ్రద్ధ వహించాల్సిన అవసరం ఉంటుంది. కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి.

వేసవిలో ఎక్కువగా దాహం వేస్తుంది.  కారం, మసాలా ఫుడ్స్ తీసుకుంటే విపరీతమైన దాహం వేస్తుంది. ఎక్కువగా నీరు తీసుకోవడం వల్ల డైజేషన్ సమస్యలు వస్తాయి.

అందువల్ల ఈ కాలంలో ఎక్కువగా స్పైస్ ఫుడ్ ను అవైడ్ చేయాలి. సాధ్యమైనంత వరకు అవితీసుకోకుండా ఉండడమే మంచిది.

వేసవి కాలంలో శరీరం ఎక్కువగా డీ హైడ్రేషన్ కు గురవుతుంది.   శరీరానికి చల్లదనం చేసే ద్రవపదార్థాలు తీసుకోవాలి.

టీ, కాఫీలు తగ్గించాలి. వీటిని తీసుకోవడం వల్ల శరీరంలో నీటి శాతం తగ్గి మరింత సమస్యలు వచ్చే అవకాశం ఉంది.

మాంసాహారం  వేసవిలో  తినడం వల్ల జీర్ణ సమస్యలు ఎదుర్కోవచ్చు. ఇవి జీర్ణక్రియను మందగించేసి కడుపులో సమస్యలు వచ్చి  విరేచనాలు రావొచ్చు.

వేపుళ్లు, పచ్చళ్లను సైతం ఈ కాలంలో అవైడ్ చేయాలి. వీటికి బదులు పెరుగన్నం, తక్కువ కేలరీలు కలిగిన ఆహారం తీసుకోవాలి.

Off-white Banner

Thanks For Reading...