Images source: google
భోజనం చేసిన తర్వాత పెరుగు లేకపోతే కొందరికి తిన్న ఫీలింగ్ ఉండదు. డైలీ లైఫ్‌లో పెరుగు తినడం వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి
Images source: google
చాలా మంది పెరుగుతో చికెన్, ఎగ్, మటన్ వంటివి తింటారు. నాన్‌వెజ్‌తో పెరుగు తింటే తిన్న ఫుడ్ జీర్ణం కాదని అంటారు. అయితే కేవలం నాన్‌వెజ్ మాత్రమే కాకుండా ఇంకా కొన్ని పదార్థాలను పెరుగుతో తినకూడదు.
Images source: google
నెయ్యి : నెయ్యిని పెరుగుతో కలిపి తినకూడదని వైద్యులు చెబుతున్నారు. పెరుగుతో కలిపి నెయ్యి తింటే కడుపు ఉబ్బరం, అజీర్ణం, చర్మ సమస్యలు, గుండె జబ్బులు వంటివి వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Images source: google
పుల్లని పండ్లు : సిట్రిక్ ఆమ్లం ఉండే నిమ్మ, నారింజ, స్ట్రాబెర్రీలను పెరుగుతో కలిపి తినకూడదు. చాలా మంది సలాడ్, పుడ్డింగ్ అంటూ పెరుగుతో చేస్తారు. ఇలా కలిపిన వాటిని తినడం వల్ల జీర్ణ సరిగ్గా కాదు. అలాగే శరీరంలో కాల్షియం కూడా లోపిస్తుంది.
Images source: google
కొవ్వు అధికంగా ఉండే పదార్థాలు : బాగా నూనెలో వేయించిన పదార్థాల్లో కొవ్వు ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల పొట్ట తొందరగా పెరుగుతుంది. అలాగే అజీర్ణం, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు వస్తాయి.
Images source: google
స్పైసీ ఫుడ్స్ : కారంగా ఉన్న పదార్థాలతో పెరుగు కలిపి తినడం వల్ల జీర్ణవ్యవస్థ దెబ్బతింటుంది. పెరుగు, స్పైసీ ఫుడ్ కలయిక వల్ల యాసిడ్ రిఫ్లెక్స్, గ్యాస్ వంటివి కడపులో ఏర్పడి గుండె మంట వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
Images source: google
తియ్యని పదార్థాలు : కొందరు పెరుగులో పంచదార వేసుకుని తింటారు. ఇలా చక్కెర మాత్రమే కాకుండా ఏవైనా స్వీట్లును పెరుగుతో కలిపి తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి.
Images source: google