తీసుకునే ఆహారం చర్మం మీద ప్రభావం చూపిస్తుంది. కొన్ని ఆహారాలు చర్మానికి పోషణను అందిస్తే.. మరికొన్ని హాని కలిగించవచ్చు. మరి ఎలాంటి పదార్థాలు స్కిప్ చేయాలో తెలుసుకోండి.

Images source: google

చక్కెర స్నాక్స్/పానీయాలు: అధిక చక్కెర తీసుకోవడం వల్ల ఇన్సులిన్ స్థాయిలు పెరుగుతాయి.దీంతో కొల్లాజెన్ విచ్ఛిన్నం అవుతుంది.తద్వారా ముడతలు, మొటిమలు వస్తాయి.

Images source: google

పాల ఉత్పత్తులు: డైరీ ప్రొడక్ట్స్ వల్ల మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది.

Images source: google

ప్రాసెస్ చేసిన ఆహారాలు: అనారోగ్యకరమైన కొవ్వులు సమృద్ధిగా ఉంటాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎరుపు, ఉబ్బు, మొటిమలు వంటి సమస్యలకు దారితీస్తుంది.

Images source: google

వేయించిన ఆహారాలు: వేయించిన ఆహారాలలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి రంధ్రాలను మూసుకుపోయేలా చేస్తాయి. పగుళ్లకు దారితీస్తాయి. చర్మం జిడ్డుగా కనిపించేలా చేస్తాయి.

Images source: google

మద్యం: అధిక ఆల్కహాల్ చర్మాన్ని నిర్జలీకరణం చేస్తుంది. చర్మం నిస్తేజంగా కనిపిస్తుంది. ముడతలను పెంచుతుంది.

Images source: google

సాల్టీ స్నాక్స్: అధిక ఉప్పు తీసుకోవడం వల్ల నీరు నిలుపుదల ఏర్పడుతుంది. ముఖ్యంగా కళ్ల చుట్టూ చర్మం ఉబ్బుతుంది.

Images source: google

రెడ్ మీట్: ఎర్ర మాంసం అధిక వినియోగం వల్ల వాపు వస్తుంది. కొల్లాజెన్ విచ్ఛిన్నంతో ముడిపడి ఉంటుంది కాబట్టి వృద్ధాప్య చర్మం త్వరగా వస్తుంది.

Images source: google t