ఆరోగ్యమైన పదార్థాలు తినకపోతే ఆరోగ్యం దెబ్బతింటుంది. కాబట్టి పిల్లలు ఇష్టమైన ఆహారాన్నే పోషకాలతో కొత్తగా తయారు చేసి ఇవ్వండి. అలా చేసి ఇవ్వడం వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారు.
Images source: google
కేవలం గోధుమపిండితో మాత్రమే చపాతీలు చేయకుండా మల్టీగ్రెయిన్ పిండితో చపాతీలు చేయండి. వీటివల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.
Images source: google
ఇలా చేసిన చపాతీలను సన్నగా కత్తిరించుకోవాలి. అలాగే కూరగాయలను చిన్న ముక్కలుగా తరిగి, సన్నగా కత్తిరించుకున్న చపాతీలతో నూడిల్స్ తయారు చేసి ఇవ్వండి.
Images source: google
రోజూ ఒకే రకమైన చపాతీలు, ఇడ్లీలు, దోసెలు కాకుండా రోజుకో కొత్తరకం చేయండి. బీట్‌రూట్, క్యారెట్, పాలకూర, పుదీనాతో చేసి ఇవ్వండి. ఇవి కలర్‌ఫుల్‌గా ఉండటం వల్ల పిల్లలు ఇష్టంగా తింటారు.
Images source: google
పిల్లలకు ఆకుకూరలతో పానీపూరీ చేసి చేయండి. మసాలా కూరకు బదులు పండ్లు, డ్రైఫ్రూట్స్ వంటివి పెట్టండి. రైస్ తినడానికి ఇష్టపడకపోతే సోయాతో కానీ, అన్ని కూరగాయలు కలిపి కిచిడిలా చేసి ఇవ్వండి.
Images source: google
కొందరు పిల్లలు పాలు తాగాడానికి అస్సలు ఇష్టపెట్టుకోరు. అలాంటప్పుడు ఏదైనా ఒక ఫూట్‌తో మిల్క్ షేక్ చేసి ఇవ్వండి.
Images source: google
కొందరు పిల్లలు మొబైల్, టీవీ చూస్తూ తింటారు. ఈ అలవాటు మంచిది కాదు. పిల్లలకు అలా గ్యాడ్జెట్స్ ఇచ్చే బదులు తినేటప్పుడు మీరే కొత్త కొత్త స్టోరీలు చెబుతుంటే వాళ్లు ఇంట్రెస్ట్‌గా వింటూ తినేస్తారు.
Images source: google
అప్పుడప్పుడు పిల్లలను వంటగదలోకి కూడా తీసుకెళ్లండి. ఏ పదార్థం తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామో, వాటి ప్రయోజనాలను పిల్లలకు తెలియజేయండి. దీంతో వాళ్లకు ఫుడ్‌పై కాస్త అవగాహన పెరిగి ఆరోగ్యమైన ఫుడ్స్ తినడానికి ఇంట్రస్ట్ చూపిస్తారు.
Images source: google
పిల్లలకు పెట్టే ఫుడ్‌లో పంచదార వాడకం తగ్గంచాలి. అవసరమైతే కొంచెం బెల్లం వాడాలి. సాయంత్రం పూట స్నాక్స్‌గా చిప్స్ వంటివి కాకుండా ఇంట్లోనే చేసిన డ్రైఫ్రూట్స్ లడ్డూ, పల్లీలు, నువ్వులతో చేసిన చెక్కిలు, రాగి లడ్డూలు చేసి ఇస్తే ఆరోగ్యానికి మంచిది.
Images source: google