Images source : google
శరీరంలో విటమిన్ లోపాన్ని అధిగమించడానికి, పప్పులను తీసుకోవడం ఉత్తమం. అయితే ఆ పప్పుల్లో ఒకటి ఎర్ర పప్పు అని మీకు తెలుసా, ఇది మన ముఖంపై సహజమైన మెరుపును తెస్తుంది.
Images source : google
ఈ స్టోరీలో మీ ముఖ సౌందర్యాన్ని పెంచే పప్పుతో చేసిన 2 ఫేస్ ప్యాక్‌ల గురించి చెప్పబోతున్నాం. సో ఆలస్యం చేయకుండా చదివేయండి.
Images source : google
మీరు పొడి చర్మంతో ఇబ్బంది పడుతుంటే, ఈ ఫేస్ ప్యాక్ సహాయంతో మీ ముఖానికి తేమను అందించవచ్చు. అయితే పాలను చాలా కాలంగా ముఖానికి మేలు చేసేవిగా పరిగణిస్తారు.
Images source : google
పప్పును రాత్రంతా నీటిలో నానబెట్టండి. మరుసటి రోజు పప్పును గ్రైండ్ చేసి పేస్ట్ లా చేసుకోవాలి. తరవాత 2 చెంచాల పాలు వేసి రోజూ ముఖానికి పట్టించాలి.
Images source : google
ముందుగా ఫేస్ వాష్‌తో ముఖాన్ని శుభ్రంగా కడుక్కోవాలి. కాంతి వంతమైన చర్మం కోసం మీరు ఈ పేస్ట్ ను రాసుకొని ఓ 15 ని.లు అలాగే ఉంచుకొని ఆ తర్వాత వాష్ చేసుకోవాలి..
Images source : google
ముల్తానీ మిట్టి ముఖానికి మేలు చేస్తుంది. ఇది చర్మాన్ని బాగా శుభ్రపరుస్తుంది. మసూర్ పప్పు, ముల్తానీ మిట్టి, తేనెతో కూడిన ఈ ఫేస్ ప్యాక్ ముఖ తేమను నిర్వహించడానికి సహాయపడుతుంది.
Images source : google
పప్పును రాత్రంతా నానబెట్టి, ఉదయాన్నే పేస్ట్ చేయండి. ఆ తర్వాత ఈ పేస్ట్‌లో 1 చెంచా ముల్తానీ మిట్టి, 2 చెంచాల తేనె వేసి బాగా మిక్స్ చేసి చిక్కటి పేస్ట్‌లా చేసుకోవాలి. మీరు వారానికి రెండుసార్లు ఇలా చేసుకోవచ్చు.
Images source : google