https://oktelugu.com/

 మనదేశంలోనూ అంతకు మించి అనే విహార ప్రదేశాలున్నాయి. ఇండియాలోనే ఉన్నప్పటికీ విదేశాల్లో విహరిస్తున్న అనుభూతిని  కలిగిస్తుంటాయి. ఇంతకీ అవేంటంటే..

Images source: google

ఖజ్జియార్ : ఈ ప్రాంతం హిమాచల్ ప్రదేశ్ లో ఉంది. చుట్టూ మంచుకొండలు.. ఆకాశాన్ని తాకే విధంగా ఉన్న వృక్షాలు.. అందమైన సెలయేళ్లతో ఈ ప్రాంతం చూసేందుకు స్విట్జర్లాండ్ లాగా కనిపిస్తుంది.

Images source: google

లక్షద్వీప్ : ఆ మధ్య భారత ప్రధాని నరేంద్ర మోడీ పర్యటించింది ఈ ప్రాంతాల్లోనే. మాల్దీవులకు మించి ప్రకృతి రమణీయత ఈ ప్రాంతం సొంతం. అందమైన దీవులు.. వాటిని దాకే సముద్ర జలాలు.. చూసేందుకు ఆ దృశ్యాలు అద్భుతంగా ఉంటాయి.

Images source: google

గుల్మార్గ్  : జమ్మూ కాశ్మీర్లోని బారా ముల్లా జిల్లా ప్రాంతంలో గుల్మార్గ్ అనే ప్రాంతం ఉంది. ఇక్కడ ఏడాది పొడవునా మంచు కురుస్తూనే ఉంటుంది.  ఈ ప్రాంతాన్ని అక్కడి స్థానికులు ఇండియన్ స్విట్జర్ లాండ్ అని పిలుస్తుంటారు.

Images source: google

శ్రీనగర్ మార్కెట్ : శ్రీనగర్ మార్కెట్ పండ్లు, ఫలాలకు ప్రసిద్ధి చెందింది. బోట్ లో ప్రయాణించి వచ్చిన తర్వాత చాలామంది ఇక్కడ వాటిని కొనుగోలు చేస్తుంటారు. కొంతమంది దానిని బ్యాంకాక్ బోట్ మార్కెట్ గా అభివర్ణిస్తుంటారు.

Images source: google

మున్నార్ : తేయాకు తోటలకు మున్నార్ హిల్స్ ప్రసిద్ధి. ఎత్తైన కొండల మధ్య తేయాకు మొక్కలు ప్రకృతి రమణీయతకు నిలువుటద్దంగా కనిపిస్తాయి. ఇవి చూసేందుకు మలేషియాలోని కామెరాన్ హైలాండ్స్ లాగా కనిపిస్తాయి.

Images source: google

షిల్లాంగ్ : మేఘాలయ రాష్ట్ర రాజధాని అయిన ఈ ప్రాంతాన్ని "స్కాట్లాండ్ ఆఫ్ ఈస్ట్" అని పిలుస్తారు. ఎందుకంటే ఈ ప్రాంతాల్లో ఉన్న చాలా ప్రదేశాలు స్కాట్లాండ్ లో ఉన్న వాటిని పోలి ఉంటాయి.

Images source: google

మలానా : మలానా అనేది హిమాచల్ ప్రదేశ్ లోని ఒక హిల్ స్టేషన్.. ప్రకృతి రమణీయతకు పెట్టింది పేరు. ఈ ప్రాంతం చూసేందుకు గ్రీస్ నగరాన్ని పోలి ఉంటుంది.

Images source: google

పుదుచ్చేరి  : తమిళనాడుకు సరిహద్దులో ఉన్న ఈ ప్రాంతం ఫ్రెంచ్ సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఫ్రెంచ్ పాలకులు చేపట్టిన ప్రతి నిర్మాణం ఫ్రెంచ్ దేశంలో మాదిరి ఉంటుంది. ఈ ప్రాంతంలో విహరిస్తే ఫ్రెంచ్ దేశంలో నడిచినట్టే ఉంటుంది.

Images source: google