https://oktelugu.com/

 దేశంలో చాలా ఆలయాలు రోజు తెరుస్తుంటారు.  కర్ణాటకలోని హాసన్ లో ఓ ఆలయం సంవత్సరానికి ఒకసారి తెరుస్తారు. సంవత్సరం తరువాత కూడా ఏడాది కింద తయారు చేసిన ప్రసాదాలు చెడిపోకుండా ఉంటాయంటే ఆశ్చర్యకరమే.

Images source: google

 మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఘడియ ఘాట్ లో మాతాజీ మందిర్ అమ్మవారి ఆలయం ఉంది. కలలో ఓ పూజారికి అమ్మవారు కనబడి ఇక నుండి దీపం నీటితో వెలిగించాలని చెప్పిందట. అప్పటి నుంచి ఇదే ఆనవాయితీగా మారింది.

Images source: google

దేశంలో పన్నెండేళ్లకోసారి తెరుచుకునే ఆలయం కూడా ఉంది.   పన్నెండేళ్ల కోసారి పిడుగు పడి అతుక్కునే దేవాలయం హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని బిజిలి మహదేవ్ ప్రాంతంలో ఉందంటే అతిశయోక్తి కాదు.

Images source: google

సంవత్సరానికి ఒకసారి సూర్య కిరణాలు తాకే   కొల్లాపూర్ లోని లక్ష్మీదేవస్థానం, బెంగుళూరులోని గవిగంగాధర్ దేవస్థానం, అరసవెల్లిలోని సూర్యనారాయణ దేవాలయం, కడప జిల్లాలోని కోదండరామాలయం.

Images source: google

మహానంది, జంబకేశ్వర్, బుగ్గరామలింగేశ్వర్, కర్ణాటక కమండ గణపతి దేవాలయం, హైదరాబాద్ లోని బుగ్గ శివాలయం, బెంగుళూరులోని మల్లేశ్వర్, బెల్లంలపల్లిలోని రాజరాజేశ్వరి ఆలయం, సిద్ధగంగా దేవాలయలాల్లో ఎప్పుడు నీరు ప్రవహిస్తూ ఉంటుంది.

Images source: google

  రంగులు మారే ఆలయాలు : తమిళనాడులోని అతిశయ వినాయక దేవాలయం. పౌర్ణమికి తెల్లగ అమావాస్యకు నల్లగా రంగు మారే ఆాలయం తూర్పుగోదావరి జిల్లాలో పంచారామ సోమేశ్వరాలయం,

Images source: google

కాణిపాకం, యాగంటి బసవన్న, కాశీ తిలదండేవ్వర్, బెంగుళూరులోని బసవేశ్వర్, బిక్కవోలు లోని లక్ష్మీగణపతి ఆలయాలు ఎప్పుడు విగ్రహాలు పెరిగే వాటిలో ఉంటాయి. ఇక్కడ విగ్రహాలు సంవత్సరానికి కొంచెం పెరుగుతున్నాయి.

Images source: google

పూరీలోని జగన్నాథ స్వామి దేవాలయంపై పక్షులు ఎగరవు. ఇది కూడా ఒక వింతే. గాలి కూడా వ్యతిరేక దిశలో వీస్తుంది. సముద్రం నుంచి గాలి దేవాలయం వైపు వీయాలి కానీ దానికి విరుద్ధంగా గాలి సముద్రం వైపు వీయడం ఇక్కడ ప్రత్యేకత.

Images source: google

ఇలా వింతలు విశేషాలు ఉన్న దేవాలయాలు మనదేశంలో కోకొల్లలు. ప్రతి ఆలయానికో విశిష్టత ఉంటుంది. దాన్ని తెలుసుకుంటే మనకు ఆశ్చర్యం వేయక మానదు

Images source: google