Images source: google
ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ లో మిస్టర్ 360, దక్షిణాఫ్రికా దిగ్గజ ఆటగాడు ఏబి డివిలియర్స్ చోటు సంపాదించుకున్నాడు.
Images source: google
"ఆధునిక క్రికెట్ లో ఎన్నో సంచలనాలకు డివిలియర్స్ నాంది పలికాడు. అతడు క్రికెట్ రంగానికి చేసిన సేవలను గుర్తించి హాల్ ఆఫ్ ఫేమ్ లో తీసుకున్నామని" ఐసీసీ వ్యాఖ్యానించింది.
Images source: google
మైదానంలో ఏ మూలకైనా అతడు బ్యాట్ తో బంతిని బాదగలడు. అందువల్లే అతడికి ఆధునిక క్రికెట్లో మిస్టర్ 360 అనే పేరు వచ్చింది.
Images source: google
దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టుకు అతడు 14 సంవత్సరాలపాటు సేవలందించాడు. అన్ని ఫార్మాట్లలో 19,864 పరుగులు చేశాడు.
Images source: google
బ్యాటింగ్ మాత్రమే కాదు ఫీల్డింగ్ తోనూ డివిలియర్స్ సంచలనాలు సృష్టించాడు. ఒకప్పటి జాంటీ రోడ్స్ ను గుర్తుకు తెచ్చేవాడు.
Images source: google
జనవరి 18, 2015న వెస్టిండీస్ జట్టుతో జరిగిన వన్డే మ్యాచ్లో 31 బంతుల్లో సెంచరీ చేసి ప్రపంచ రికార్డు సృష్టించాడు. మొత్తంగా 44 బంతుల్లో 149 రన్స్ చేశాడు.
Images source: google
2015 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ లో జరిగిన మ్యాచ్ లో 66 బంతుల్లో 162* పరుగులు చేసి రికార్డు సృష్టించాడు.
Images source: google
పరుగులపరంగా దక్షిణాఫ్రికా జట్టులో కలిస్ తొలి స్థానంలో కొనసాగుతుండగా.. డివిలియర్స్ రెండవ స్థానంలో ఉన్నాడు.
Images source: google