ఆఫ్ఘనిస్తాన్ మ్యాజిక్ చేయలేకపోయింది.  సెమీస్ మ్యాచ్లో చేతులెత్తేశారు. దక్షిణాఫ్రికా బౌలర్లకు దాసోహమయ్యారు.

గుర్బాజ్(0), నూర్ అహ్మద్(0), నబీ(0) ఇలా ఏకంగా ముగ్గురు బ్యాటర్లు సున్నా పరుగులకే వెనుతిరిగారంటే.. దక్షిణాఫ్రికా బౌలింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

ఇబ్రహీం జద్రాన్(2), ఖరోటే(2), కరీమ్ జనత్(8), రషీద్ ఖాన్ (8), గుల్బాదిన్(9), అజ్మతుల్లా (10) పూర్తిగా నిరాశపరచారు. 

దక్షిణాఫ్రికా బౌలర్లలో జాన్సన్, షమ్సీ తలా మూడు వికెట్లు దక్కించుకున్నారు. రబాడా, నోర్ట్జే చెరో రెండు వికెట్లు పడగొట్టారు..

 ఇక 57 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 8.5 ఓవర్లలో 60 పరుగులు చేసి, 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 

ఈ గెలుపు ద్వారా దక్షిణాఫ్రికా తొలిసారి టి20 వరల్డ్ కప్ లో ఫైనల్ చేరింది

ఇక ఈ ఓటమి ద్వారా ఆఫ్ఘనిస్తాన్ ఆటగాళ్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఆప్ఘాన్ ఔట్.. తొలిసారి ఫైనల్ కు  సౌత్ ఆఫ్రికా పూర్తి సమాచారం  కోసం Read more  క్లిక్ చేయండి.