ముంబైకి చెందిన ఆదా శర్మ మల్టీ టాలెంటెడ్. అందంతో పాటు డాన్స్, జిమ్నాస్టిక్స్, యుద్ధ విద్యల్లో కూడా ప్రవేశం ఉంది.

ఎన్ని కళలు వచ్చినా ఆ లక్ అనేది ఒకటి ఉండాలి. ఆదా శర్మకు అదే మైనస్.

ఆమెకు మొదటి నుండి అదృష్టం కలిసి రాలేదు.

సోలో హీరోయిన్ గా చేసిన సినిమాలు ఫెయిల్ కావడంతో పరిశ్రమలో నిలదొక్కుకోలేకపోయింది. స్టార్ కాలేకపోయింది.

2008లో విడుదలైన '1920' అనే ప్రయోగాత్మక చిత్రంతో ఆదా సిల్వర్ స్క్రీన్ కి పరిచయమయ్యారు. ఆ మూవీలోని నటనకు ఆదాకు ప్రశంసలు దక్కాయి.

దర్శకుడు పూరి జగన్నాధ్ హార్ట్ ఎటాక్ మూవీతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయం చేశాడు. నితిన్ హీరోగా నటించిన ఈ చిత్రం విజయం సాధించలేదు.

ఆఫర్స్ లేని ఆదా అందాల ఆరబోత పనిగా పెట్టుకుంది. తాజాగా విపరీతమైన స్కిన్ షో చేస్తూ ఫోటో షూట్ చేశారు. సదరు ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయగా వైరల్ అవుతున్నాయి.

సినిమా అవకాశాల కోసం ఆదా శర్మ దర్శక నిర్మాతలను తన గ్లామర్ తో ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని పలువురు అభిప్రాయపడుతున్నారు.

Off-white Banner

Thanks For Reading...